తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి సంబంధించి ఆదివారం జిల్లా కమిటీలను ప్రకటించనున్నారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు, 25 మంది అధ్యక్షులను నియమించనున్నారు ప్రతిపక్షనేత.

ఇందుకు సంబంధించి 11.50 గంటలకు కమిటీలపై ఆయన ప్రకటించనున్నారు. పార్లమెంట్ ఒక యూనిట్‌గా జిల్లా అధ్యక్షులను చంద్రబాబు ఎంపిక చేయనున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గాన్ని కొద్దిరోజుల్లో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటితో పాటు 13 జిల్లాలకు 13 మంది సమన్వయకర్తలు, ప్రతి రెండు పార్లమెంట్‌లకు ఒక ఇన్‌ఛార్జ్ ఉండనున్నారు. మొత్తం 51 మందితో లిస్ట్ ఉంటుందని అంచనా.