Asianet News TeluguAsianet News Telugu

Pandora Papers: పాండోరా పత్రాల్లో జగన్ పేరు ఉండే ఉంటుంది... టీడీపీ

‘షెల్ కంపెనీలను సృష్టించి అవినీతికి పాల్పడటంలో జగన్ దిట్ట. అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. పాండోరా పత్రాల్లో రాష్ట్రం నుంచి ఎవరున్నారో పరిశోధించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి’ అని సోమవారంం తేదేపా అదినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్ లైన్ లో జరిగిన పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. 

TDP suspects jagan name in 'Pandora Papers'
Author
Hyderabad, First Published Oct 5, 2021, 7:26 AM IST

పన్ను ఎగవేతదారుల జాబితాలను బయటపెట్టిన పాండోరా పేపర్స్ (Pandora Papers) లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (YS Jagan)పేరు కూడా ఉండే అవకాశం ఉందని తేదేపా నేతలు (TDP)అభిప్రాయపడ్డారు. 

‘షెల్ కంపెనీలను సృష్టించి అవినీతికి పాల్పడటంలో జగన్ దిట్ట. అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. పాండోరా పత్రాల్లో రాష్ట్రం నుంచి ఎవరున్నారో పరిశోధించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి’ అని సోమవారంం తేదేపా అదినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్ లైన్ లో జరిగిన పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. 

ప్రజలమీద విద్యుత్ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో పెద్ద ఎత్తున ఉద్యమం చేటప్టాలని కూడా నిర్ణయించారు. ఈ సమావేంలో తేదేపా నేతలు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఆయా నాయకులు వ్యక్తం చేసి అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలు ఇవీ..

రాష్ట్రంలో డ్రగ్ మాఫియా చెలరేగుతోంది. తాడేపల్లి నుంచి వచ్చు ఆదేశాలతోనే రూ. వేల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇసుక, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా హవాలా రూపంలో రూ.వేలకోట్లు విదేశాలకు తరలిపోతున్నాయి. వైకాపా నేతలు డ్రగ్స్ డాన్ లుగా, స్మగ్లింగ్ కింగ్ లుగా అవతారమెత్తారు. 

నకిలీ మద్యం తయారవుతోంది. మద్యంలో మాదకద్రవ్యాల్ని కూడా కలుపుతున్నట్టు ప్రజలు భావిస్తున్నారు. లిక్కర్ మాఫియా ద్వారా వచ్చిన డబ్బుని హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ కి బినామీగా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటిపై దర్యాప్తు జరపాలి.

ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా నియంత్రణకు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విద్యార్థులు వైరస్ బారినపడుతున్నారు. తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలి. 

తేదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేంత వరకు పోరాటం.

రైతులు వేసిన పంట వివరాలు ప్రభుత్వ లెక్కల్లో చేరడంలేదు. రైతులకు పెట్టుబడి సాయం, పంట బీమా అందడం లేదు. ప్రభుత్వం మీబా ప్రీమియంం చెల్లించడం లేదు. యంత్ర పరికరాల సరఫరా నిలిచిపోయింది. రాయలసీమలో వేరుసెనగ పంటకు రక్షక తడులు, మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా కేంద్రం ఇచ్చే నిధుల్ని రైతులకు అందించడంలో విఫలమయ్యింది. 

తేదేపా హయాంలో ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన పథకాల్ని జగన్ రెడ్డి రద్దు చేశారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయంపై తేదేపా పోరాడుతుంది. 

డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉండొద్దు: పోలీసులకు ఏపీ సీఎం జగన్ ఆదేశం

ప్రజా రాజధాని అమరావతిని జగన్ రెడ్డి నాశనం చేశారు. హైదరాబాద్ లో భూములు వేలం వేస్తే ఎకరం రూ.60 కోట్ల చొప్పున పలికింది. ఇక్కడ మాత్రం ఉద్యోగాల్లేక యువత నష్టపోతోంది. అమరావతి నిర్మాణం నిలిపివేయడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. 

శ్రీకాకుళం జిల్లా పలాసలో గోవుల్ని ట్రాక్టర్ కు ట్టి మున్సిపల్ సిబ్బంది అమానుషంగా ఈడ్చుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండించింది. 

ఉపాధి హామీ, నీరు-చెటు పనులకు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ తాత్సారంమీద తేదేపా పోరాటం కొనసాగిస్తుంది.

విశాఖ, ఇతర ప్రాంతాల్లోని ప్రజా ఆస్తుల్ని తాకట్టుపెట్టి మరీ అక్రమ పద్ధతిలో అప్పులు చేసి, దొంగ లెక్కలు చూపిస్తూ, ప్రభుత్వ ఖజానా దోచుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios