డ్రగ్స్ ఆనవాళ్లు ఉండొద్దు: పోలీసులకు ఏపీ సీఎం జగన్ ఆదేశం
రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. శాంతిభద్రతల సమస్యపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుండి ఎక్కడికి సరఫరా అవుతోందోననే విషయమై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.
అమరావతి:రాష్ట్రంలో డ్రగ్స్ (drug)సరఫరా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్(ys jagan) ఆదేశించారు.సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ శాంతి భద్రతలపై పోలీస్ ఉన్నతాధికారులతో తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
also read:ఆర్యన్‌ఖాన్‌కి కోర్టు షాక్: బెయిల్ తిరస్కరణ, ఈ నెల 7వ తేదీ వరకు కస్టడీ
కాలేజీలు(college), యూనివర్శిటీల్లో (universities) డ్రగ్స్ ఆనవాళ్లు ఉండకుండా పోలీస్ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఎవరు ఎక్కడి నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయమై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని సీఎం పోలీసులను కోరారు. అక్రమ మద్యం తయారీ దారులపై కూడ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.మహిళలు, చిన్నారులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడేవారికి వెంటనే శిక్షలు పడేలా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.