Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో టిడిపి-వైసిపి వర్గీయుల ఘర్షణ, ముగ్గురు టిడిపి నేతల దారుణ హత్య

గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న వివాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఓ సిమెంట్ రోడ్డు విషయంలో వైసిపి-టిడిపి వర్గీయుల మద్య చిన్నగా మొదలైన గొడవ కాస్తా పెద్దదై అధికార పార్టీ వర్గీయుల హత్య కు దారితీసింది.

tdp supporters murder in guntur district
Author
Vinukonda, First Published Aug 10, 2018, 11:00 AM IST

గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న వివాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఓ సిమెంట్ రోడ్డు విషయంలో వైసిపి-టిడిపి వర్గీయుల మద్య చిన్నగా మొదలైన గొడవ కాస్తా పెద్దదై అధికార పార్టీ వర్గీయుల హత్య కు దారితీసింది.

ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం కు ప్రభుత్వం సిమెంట్ రోడ్డు మంజూరు చేసింది. అయితే ఈ కాంట్రాక్టును టిడిపి వర్గీయులైన చల్లా వెంకటకృష్ణ(26),మేడబోయిన మల్లిఖార్జున్(28) గురజాల సోమయ్య(30) దక్కించుకున్నారు. దీంతో వీరు రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తుండగా అదే గ్రామానికి చెందిన వైసిపి వర్గీయులు ఆ పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో వెంకటకృష్ణ, సోమయ్య, మల్లిఖార్జున్ ముగ్గురూ కలిసి ఈ గొడవ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఒకే బైక్ పై వినుకొండకు బయలుదేరారు. దీన్ని గుర్తించిన వైసిపీ వర్గీయలు ఓ కారులో వారిని వెంబడించారు. ఈ క్రమంలో వారి బైక్ ను కారుతో ఢీ కొట్టడంపై ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ఓ లారీ వారిని ఢీ కొట్టడంతో సోమయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మల్లికార్జున్, వెంకట్ లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  

ఈ హత్యలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios