ప్రచారంలో పాల్గొన్నవారికి, బహిరంగ సభల్లో పాల్గొన్న వారికి డబ్బులు ఇవ్వటమే ఇప్పటి వరకూ చూసాం. ఎగస్పార్టీ సభలకు వెళ్లకపోతే కూడా డబ్బులిస్తామని ప్రలోభాలకు గురిచేయటం నంద్యాలలోనే మొదలైంది. అధికార, ప్రతిపక్షాల్లో ఎవరికి అవసరమైనా జనాలు రావాలంటే డబ్బులు పంపిణీ చేయాల్సిందే. చాలా చోట్ల అదే జనాలు మళ్ళీ మళ్ళీ కనిపించటం కూడా మనం గతంలో చూసాం.
నంద్యాలలో డబ్బే డబ్బు. ప్రచారంలో పాల్గొన్నవారికి, బహిరంగ సభల్లో పాల్గొన్న వారికి డబ్బులు ఇవ్వటమే ఇప్పటి వరకూ చూసాం. ఎగస్పార్టీ సభలకు వెళ్లకపోతే కూడా డబ్బులిస్తామని ప్రలోభాలకు గురిచేయటం నంద్యాలలోనే మొదలైంది. అధికార, ప్రతిపక్షాల్లో ఎవరికి అవసరమైనా జనాలు రావాలంటే డబ్బులు పంపిణీ చేయాల్సిందే. చాలా చోట్ల అదే జనాలు మళ్ళీ మళ్ళీ కనిపించటం కూడా మనం గతంలో చూసాం.
అయితే, నంద్యాల ఉపఎన్నికలో మాత్రం విచిత్రాలు జరుగుతోంది. ఎలాగంటే, తన సభలకు, ప్రచారానికి డబ్బులు ఇచ్చి టిడిపి జనాలను రప్పించుకుంటోంది. అంత వరకూ బాగానే ఉంది. కానీ వైసీపీ సభలకు, ప్రచారానికి వెళ్ళకుండా ఉండటానికి కూడా టిడిపి డబ్బులిస్తుండటమే విచిత్రంగా ఉంది.
అంటే, టిడిపికి అనుకూలంగా ప్రచారంలో పాల్గొన్నా డబ్బే, వైసీపీ సభలకు, ప్రచారానికి దూరంగా ఉన్నా డబ్బే. అంటే రెండింటికి టిడిపినే డబ్బులిస్తోందన్నమాట. కొన్ని సార్లు డబ్బులిస్తున్న నేతలు చాలాసార్లు టోకెన్లనే వాడుతున్నారు. అంటే ఆ టోకెన్లను డబ్బుగా మార్చుకోవాలన్నమాట.
మొన్న 3వ తేదీన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరిగింది గుర్తుందికదా? అక్కడి నుండి టిడిపి ఇటువంటి ఎత్తులు మొదలుపెట్టిందట. బహిరంగసభకు హాజరుకాకపోతే డబ్బులిస్తామని ఎరేసింది. దాంతో చాాాలామంది టిడిపి వద్ద డబ్బులు తీసుకున్నారు. అయితే, ఇంకా డబ్బులు తీసుకున్న వారిలో చాాలామంది బహిరంగ సభకు హాజరవ్వటంతో టిడిపి మైండ్ బ్లాంక్ అయింది. అప్పటి నుండి టిడిపి డబ్బులతో ప్రలోబాలకు గురిచేస్తుూనే ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే నంద్యాలలో జనాలకు డబ్బే డబ్బన్నమాట.
