అదే సందర్భంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో వసంతకు బాగా సన్నిహిత సంబంధాలున్నాయి.

కృష్ణాజిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత త్వరలో వైసిపిలో చేరనున్నారు. ప్రస్తుతం నందిగామ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.అదే సందర్భంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో వసంతకు బాగా సన్నిహిత సంబంధాలున్నాయి.

పోయిన ఎన్నికల్లోనే వసంత వైసిపి తరపున పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే, అప్పటికే నందిగామలో టిడిపి తరపున టిక్కెట్టు ఖరారైందన్న ప్రచారం ఊపందుకోవటంతో వసంత టిడిపిలోనే ఉండిపోయారు.

అయితే, చివరకు చంద్రబాబునాయుడు నందిగామలో టిక్కెట్టు ఇవ్వకపోగా టిడిపి అభ్యర్ధి గెలుపు బాధ్యతలను వసంతకు అప్పగించారు.దాంతో టిడిపికే పని చేయాల్సొచ్చింది. తర్వాత ఎంఎల్ఏ హాటన్మరణంతో ఉపఎన్నిక జరిగింది. అప్పుడు ఎంఎల్ఏ కూతురుకు టిక్కెట్టిచ్చారు.

దాంతో నందిగామలో తనకు టిడిపి తరపున పోటీ చేసే అవకాశం రాదన్న విషయం అర్ధమైపోయింది.అదే సందర్భంలో మైలవరంలో పోటీ చేయాలనుకున్న వసంతకు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అడ్డుపడుతున్నారు. అంటే ఇక్కడ కూడా టిక్కెట్టు రాదని తేలిపోయింది.

దాంతో టిడిపిలో ఎక్కడా పోటీ చేసే అవకాశం రాదని తేలిపోవటం, అదే సందర్భంలో వైసిపి నుండి ఆహ్వానం రావటంతో వసంత టిడిపిని వదిలేసేందుకు నిర్ణయించుకున్నారట.

తన మద్దతుదారులు కూడా అదే విషయాన్ని గట్టిగా చెతున్నారు. బహుశా పాదయాత్రలో భాగంగా జగన్ కృష్ణాజిల్లాలోకి అడుగుపెట్టినపుడు వసంత వైసిపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.