విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. సామాన్యులు మొదలు వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఎవ్వరినీ ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఇలా ఈ వైరస్ బారినపడి విజయవాడ జిజిమెచ్ లో చికిత్స పొందుతున్న సీనియర్ టిడిపి నాయకులు, మాజీ కాపు కార్పోరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ శుక్రవారం ఉదయం మృతిచెందారు. 

రామానుజయ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలోనే కరోనా సోకింది. దీంతో ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు జిజిహెచ్ కు తరలించారు. అయితే అతడి పరిస్థితి విషయమంగా వుండటంతో డాక్టర్లు అతడిని వెంటిలేటర్ వుంచి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికి వైద్యానికి అతడి శరీరం ఏమాత్రం స్పందించకపోవడంతో ఇవాళ ఉదయం అతడు మృతిచెందాడు.

read more  కరోనా వ్యాప్తికి కారకులెవరు... ప్రభుత్వమా, వైద్యులా?: నాదెండ్ల డాక్టర్ అరెస్ట్ పై చంద్రబాబు, లోకేష్

రామానుజయ మృతితో ఆయన కుటుంబంలోనే కాదు రాష్ట్ర టిడిపిలో విషాదం నెలకొంది. ఆయన కుటుంబసభ్యులకు టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రామానుజయ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

''గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేశాక తొలి చైర్మన్ గా కార్పొరేషన్ కు ఉత్తమ సేవలందించిన చలమలశెట్టి రామానుజయగారి మరణం విచారకరం. పార్టీకి, కాపుల పురోగతికి, సంక్షేమానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం'' అంటూ రామానుజయ సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.