Asianet News TeluguAsianet News Telugu

అటో ఇటో ఏదో తేల్చండి: సీఎం జగన్ తో వంశీ భేటీ

డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా వద్దా...? ఎమ్మెల్యే పదవిని వదులుకుంటే తనకు ఇచ్చే గౌరవం ఏంటి...? అనే అంశాలపై సీఎం జగన్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Tdp rebel mla Vallabhaneni vamsi met cm YS Jagan along with minister Kodali Nani
Author
Amaravathi, First Published Nov 26, 2019, 3:50 PM IST

అమరావతి: టీడీపీ మాజీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరతారా..? జగన్ కండీషన్ కు కట్టుబడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా....? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయోద్దని నియోజకవర్గ కార్యకర్తలు సూచిస్తున్న తరుణంలో ఆయన ఏం చేయబోతున్నారు....? ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే ప్రజలు గెలిపిస్తారా...? ఈ అంశాలు వల్లభనేని వంశీ అనుచరులను వేధిస్తున్నాయి. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఏదో ఒకటి తేల్చుకునేందుకు సిద్ధమయ్యారట వల్లభనేని వంశీ మోహన్. అందులో భాగంగా తన స్నేహితుడు, ఏపీ మంత్రి కొడాలి నానితో కలిసి సీఎం జగన్ ను కలిశారట. 

also read: పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ మంత్రి

డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా వద్దా...? ఎమ్మెల్యే పదవిని వదులుకుంటే తనకు ఇచ్చే గౌరవం ఏంటి...? అనే అంశాలపై సీఎం జగన్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై వల్లభనేని వంశీ మోహన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడాన్ని అంగీకరించడం లేదని చెప్పుకొస్తున్నారు. 

also read: జగన్ మావాడే అనుకున్న.. కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు.. మాజీ ఎంపీ అవేదన

అటు తెలుగుదేశం పార్టీ సైతం వంశీని దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వంశీ మాట్లాడాలంటూ హెచ్చరించారు. 

 ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన వంశీ జగన్ నుంచి ఒక గట్టి హామీని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఎమ్మెల్యే వంశీకి ఆమోదయోగ్యమైన హామీ ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios