Jagananna Gorumudda:  జగనన్న గోరుముద్ద పథకంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని పట్టాభి ఆరోపించారు. ఈ పథకంలో 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని.. ఇవేమీ అలాంటి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏపీ సర్కారు పక్కదారి పట్టిస్తోందన్నారు. 

Jagananna Gorumudda: ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. ఏపీని అప్పులపాలు చేసి జ‌గ‌న్ స‌ర్కార్ దోచుకుంటోందనీ, ఓవైపు ఉద్యోగులు తమ జీతాల కోసం ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తనకు ఇష్టం వచ్చినట్లు పంపకాలకు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

జ‌గనన్న గోరుముద్ద పథకంలోనూ పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. ఈ ప‌థ‌కం అమలు కు 60 శాతం నిధులను కేంద్రమే అందిస్తుంద‌నీ, జగన్ తన జేబులో నుంచి తీసి ఇస్తున్న డబ్బులు కావన్నారు. కానీ కేంద్రం అందిస్తున్న నిధుల‌ను కూడా ఖ‌ర్చు పెట్ట‌కుండా.. వైసీపీ ఎమ్మెల్యేలు పక్కదారి పట్టిస్తోందన్నారు. చిక్కీలు సరఫరా చేసే కేంద్ర కంపెనీని దిక్కుమాలిన కారణాలు చెప్పి డిస్ క్వాలిఫై చేశారని పట్టాభి విమర్శించారు. దీనిపై సదరు కంపెనీ కోర్టుకు వెళ్లినా బెదిరింపులకు గురిచేసి పిటిషన్‌ను వెనక్కి తీసుకునేలా చేశారని మండిపడ్డారు.

చిక్కీలు సరఫరా చేసే కేంద్ర కంపెనీపై లేని పోని కార‌ణాలతో చెప్పి.. కాంట్రాక్ట్ నుంచి తొలిగించార‌ని పట్టాభి విమర్శించారు. దీనిపై సదరు కంపెనీ కోర్టుకు వెళ్లినా బెదిరింపులకు గురిచేసి పిటిషన్‌ను వెనక్కి తీసుకునేలా చేశారని మండిపడ్డారు. పిల్లలకు సరఫరా చేసే చిక్కీల విషయంలో కమిషన్ ల కోసం రాష్ట్రపతి నివాసానికి సరఫరా చేసే కంపెనీపై వేటు వేయడం దారుణమ‌ని పట్టాభి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

పిల్లల దగ్గరకు వెళ్లి మేనమామ అని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, పిల్లలు ఈరోజు ఆయన అసలు రంగును అర్థం చేసుకున్నారని అన్నారు. ఆయన మేనమామ కాదనీ, దొంగమామ అని వాళ్లే చెప్తున్నారని పట్టాభి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చిక్కీల విషయంలో సుమారు రూ.200 కోట్ల స్కాం జరుగుతోందని పట్టాభి విమర్శలు చేశారు. 

చిక్కీ సరఫరాకు గతేడాది రూ.136 కోట్లు ఉన్న టెండర్ ను ఈ ఏడాది అమాంతం రూ.198 కోట్లకు పెంచేశారు. అర్హత లేని కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారు. వివిధ స్కామ్ ల ద్వారా వేలకోట్లు దిగమింగిన జగన్ రెడ్డి.. వారానికి మూడుసార్లు పిల్లలకు పంచే చిక్కీలో కూడా కక్కుర్తి పడ్డారు.

ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని… ఓ వైపు ఉద్యోగులు తమ జీతాల కోసం ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడంలేదన్నారు. పీఆర్సీ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు మార్చి పోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో కొత్త జిల్లాలను తెరపైకి తీసుకువచ్చారని నిప్పులు చెరిగారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తనకు ఇష్టం వచ్చినట్లు టెండరింగ్‌ పంపకాలకు జగన్ ప్రభుత్వం పాల్పడుతోందని పేర్కొన్నారు.