కడప : తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేష్టలు భరించలేకే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారని ఆరోపించారు. 

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిందేనన్నారు. చంద్రబాబుకు వయసుపైబడుతోందని, ఆయన రాజకీయాల నుంచి వైదొలగడమే ఉత్తమమన్నారు. 

ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో చంద్రబాబు ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తొందర్లోనే చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం ఖాయమన్నారు. అందుకే ముందస్తుగా అవినీతిలో భాగస్వామ్యులుగా ఉన్న ఎంపీలను బీజేపీలో చేర్పించారనేది జగమెరిగిన సత్యమన్నారు.