Asianet News TeluguAsianet News Telugu

ఎంపి కార్యాలయమే పేకాట క్లబ్బు..ఎవరా ఎంపి ?

  • ‘నిబంధనలున్నవి ఉల్లంఘించటానికే’ అన్న ఓ సినిమా డైలాగ్ ను తెలుగుదేశంపార్టీ ప్రజాప్రతినిధులు అక్షరాల ఆచరణలో పెట్టి చూపుతున్నారు.
TDP MP office has become den for playing cards

‘నిబంధనలున్నవి ఉల్లంఘించటానికే’ అన్న ఓ సినిమా డైలాగ్ ను తెలుగుదేశంపార్టీ ప్రజాప్రతినిధులు అక్షరాల ఆచరణలో పెట్టి చూపుతున్నారు. టిడిపి నేతలు ఏమి చేసినా అడగటానికి లేదన్నట్లుగా ఉంది పరిస్దితి. టిడిపి నేతలు ఏ స్ధాయికి వెళ్ళిపోయారంటే, పోలీసులను నిర్భందిస్తారు, కొడతారు, ఉన్నతాధికారులపైకి దాడులు చేస్తారు, క్రిందస్ధాయి సిబ్బందిని చితక్కొడతారు. అయినా వారినేమీ అనకూడదు. ఎందుకంటే, టిడిపి ప్రజాప్రతినిధులకు నియమాలు, నిబంధనలు ఏవీ వర్తించవు.

ఇక, ప్రస్తుత విషయానికి వస్తే టిడిపికి చెందిన ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వర్రావు (బాబు) అధికారిక కార్యాలయంలో పేకాట జోరుగా సాగుతోందట. దాదాపు ఏడాదిన్నరగా కైకలూరులోని ఎంపి కార్యాలయంలో విచ్చలవిడిగా పేకాట జరుగుతున్నా పోలీసులకు ఏమీ తెలీదట. ఇక్కడ రోజుకు సుమారు రూ. 12 కోట్ల వరకూ చేతులు మారుతున్నాయట. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, శ్రీకాకుళం, భీమవరం, కృష్ణా, గుంటూరు విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల నుండి పందెం రాయళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడకు వచ్చి కోట్లు పెట్టి ఆడుతున్నారట.

నిజానికి రాష్ట్రంలో అధికారికంగ పేకాట క్లబ్బులు లేవు. అయితే, అనధికారికంగా అక్కడక్కడ నడుస్తూనే ఉంటాయి. మొన్ననే అమరావతి సమీపంలోనే ఓ క్లబ్ ను పోలీసులు మూయించేసారు. విచిత్రమేమిటంటే, సదరు క్లబ్ కేవలం మహిళలకు మాత్రమే. అక్కడ కూడా సొసైటీలో బాగా పేరున్న పెద్ద వాళ్ళ భార్యలే అక్కడ రోజూ పేకాటాడేది. మరేమైందో ఏమో విషయం బయటకు పొక్కటంతో పోలీసులు నిఘాపెట్టి దాడులు చేసి మరీ క్లబ్బును మూయించేసారు.

సరే, మహిళా క్లబ్బు కాబట్టి పోలీసులు దాడి చేసి మూయించగలిగారు. మరి, ఎంపి కార్యాలయంలో నిర్వహిస్తున్న క్లబ్బు మాటేంటి? ఈ క్లబ్బు మీద కూడా దాడులు చేస్తారా? ఇంకా నయ్యం. ఈ క్లబ్బు మీద దాడి చేసే ధైర్యమే పోలీసులకుంటే ఆ పని ఎప్పుడో చేసేవారు. ఒకవేళ దాడిచేస్తే పోలీసులను బతకనిస్తారా? వెంటపడి పట్టుకుని చావగొట్టరూ? ప్రస్తుత విషయానికి వస్తే ఈ క్లబ్బులోకి ఎంటర్ కావాలంటే ముందుగా రూ. 5 వేలు కట్టి రిజిస్టర్ చేసుకోవాలట. కనీసం రూ. 5 లక్షలు చూపించిన వాళ్ళను మాత్రమే లోనికి అడుగుపెట్టనిస్తారట. సరే, ఇంత భారీ స్ధాయిలో క్లబ్బు నిర్వహిస్తున్నపుడు భోజనం, మందు లాంటివి సరఫరా చేయటం పెద్ద విషయం ఏమీ కాదుకదా?

ఈ క్లబ్బులో మరో సౌలభ్యం కూడా ఉందట. అప్పులిచ్చి మరీ ఆడిస్తారట. కాకపోతే రూ. 10 లక్షల అప్పుకు రోజుకు కమీషన్ రూ. 20 వేలట. ఇలా అప్పులు తీసుకున్న వారిలో వైజాగ్,  భీమవరం, ఒంగోలుకు చెందిన కొందరు తమ అప్పులు తీర్చటానికి తమ ఆస్తులను అమ్ముకున్నారట. ఏం చేస్తాం టిడిపి వాళ్ళు ఏం చేసినా రైటే అన్నట్లుంది పరిస్దితులు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios