టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సారి ముఖ్యమంత్రి జగన్ ని వివరిస్తూ... ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. విజయవాడలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందని కేశినేని నాని పేర్కొన్నారు.

విజయవాడ వాసులు ఈ రోడ్ల కారణంగా నానా అవస్థలు పడుతున్నారని కేశినేని నాని పేర్కొన్నారు. వెంటనే రోడ్ల మరమ్మతు చేయాలని కేశినేని ఫేస్ బుక్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓ వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని తన పోస్టుకి ట్యాగ్ చేసి మరీ.. తన విన్నపాన్ని ప్రభుత్వానికి వివరించారు.

ఇదిలా ఉంటే... మొన్నటి వరకు కేశినేని... ఎమ్మెల్సీ బుద్ధా, వైసీపీ నేత పీవీపీలతో సోషల్ మీడియా వార్ చేశారు. బుద్ధా కాస్త వెనక్కి తగ్గడంతో... ఈ వార్ కి పులిస్టాప్ పడింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కేశినేని తన అభిప్రాయాలన్నింటినీ సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తుండటం విశేషం.