టీడీపీ ఏం చేసినా ఓపెన్‌గానే.. వైసీపీలా దొంగాచాటుగా కాదు: కనకమేడల

First Published 2, Jul 2018, 3:18 PM IST
TDP MP Kanakamedala Ravindrakumar fires on YSRCP
Highlights

టీడీపీ ఏం చేసినా ఓపెన్‌గానే.. వైసీపీలా దొంగాచాటుగా కాదు: కనకమేడల

తెలుగుదేశం పార్టీ ఏం చేసినా..ఓపెన్‌గానే చేస్తుందన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్. అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వంచనదీక్షపై ఆయన విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం... ఎన్డీఏ నుంచి బయటకు రావడం.. అవిశ్వాసం పెట్టడం అంతా తెలుగుదేశం పార్టీ బహిరంగంగానే చేసిందన్నారు.. కానీ వైసీపీలా చీకట్లో పనులు చక్కబెట్టడం తమకు రాదన్నారు.

కేంద్రం తీరుకు నిరసనగా రాజీనామాలు చేశామని చెబుతున్న వైసీపీ మరి రాజ్యసభ సభ్యులచేత ఎందుకు రాజీనామా చేయించలేదని కనకమేడల ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రప్రభుత్వాన్ని, మోడీని విమర్శించడం మాని.. ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

జగన్ తన కేసుల మాఫీ కోసం ప్రధాని మోడీతో కలిసిపోయి రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వంచన దీక్ష పేరుతో ప్రజలను వంచించడం.. రాజీనామాల పేరుతో జనాన్ని మోసగించడం వైసీపీ నైజమని ఎద్దేవా చేశారు.. 

loader