ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసును తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌లో లేవనెత్తింది. బుధవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. జగన్‌పై 11 అవినీతి కేసులు ఉన్నాయన్నారు.

అంతేకాకుండా తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతిని రవీంద్రకుమార్ ప్రస్తావించారు. అయితే జగన్ పేరును లేవనెత్తడంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అభ్యంతరం తెలిపారు.

Also Read:లోక్‌సభలో అమరావతి గురించి లేవనెత్తిన గల్లా, అడ్డుతగిలిన వైసీపీ ఎంపీలు

ఇది ఒక విస్తృతమైన అంశమని.. కేవలం ఆ అంశానికి కట్టుబడి చర్చ జరగాలని తేల్చి చెప్పారు. రాష్ట్రం పేరు గానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును గానీ సభలో ప్రస్తావించకూడదని వెంకయ్య సూచించారు. ఛైర్మన్ ఈ విషయంపై వివరిస్తుండగానే.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కనకమేడల ప్రసంగానికి అడ్డు తగిలారు. దీనిపై వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు.

ఛైర్మన్ స్థానంలో తాను ఉన్నానని కనకమేడల వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించడంపై సరికాదన్నారు. దీనిపై స్పందించడానికి మీరు మంత్రి కాదని విజయసాయిరెడ్డికి సూచించారు.

Also Read:పిచ్చి నవ్వు నవ్వుతూ ఎదురుదాడి.: జగన్ మీద చంద్రబాబు వ్యాఖ్య

ఈ క్రమంలో తన ప్రసంగాన్ని పూర్తి చేసిన రవీంద్ర కుమార్ సీఎం జగన్‌పై ఉన్న సీబీఐ కేసులను త్వరగా విచారించాలని.. అలాగే ప్రజాప్రతినిధులు, సీఎంలపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.