అమరావతి నుంచి రాజధాని తరలింపుపై టీడీపీ ఎంపీ గల్లా జయదేశ్ లోక్‌సభలో గళమెత్తారు. 2015లోనే కేంద్రం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని.. రాజధాని రాష్ట్ర సమస్య కాదని జాతీయ సమస్యని గల్లా వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చిందని.. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవని జయదేవ్ గుర్తు చేశారు. దీనిపై మధ్యలో కలగజేసుకున్న వైసీపీ ఎంపీలు గల్లా జయదేవ్ ప్రసంగానికి అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ తీర్మానంపై పార్లమెంట్ జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు.