మోడీ నియంతలా ప్రవర్తిస్తున్నారు: జెసి సంచలనం

First Published 17, Jun 2018, 11:22 AM IST
TDP MP JC Diwakar Reddy sensational comments on Modi
Highlights

మోడీపై జెసి హట్ కామెంట్స్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము నియంత హిట్లర్ ను చూడలేదన్నారు. కానీ, మోడీ వ్యవహరశైలి అదే రకంగా ఉందన్నారు.

న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు టిడిపి ఎంపీలు కూడ శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఉదయం జెసి దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఏపీకి ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. ఈ అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబునాయుడు ప్రస్తావించనున్నారని ఆయన చెప్పారు.ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో దీక్ష చేస్తున్న సీఎం కేజ్రీవాల్ ను కలవకుండా అనుమతివ్వకపోవడం దారుణమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయాలు చేయడం సరికాదన్నారు.  ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను చూసేందుకు వెళ్లిన సీఎంలను అడ్డుకుని అవమానించారని విమర్శించారు. ఢిల్లీ సీఎంను కలవకుండా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ముఖ్యమంత్రులకు అవకాశం ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. సమస్యను పరిష్కరించడాన్ని పక్కనపెట్టి మోదీ రాజకీయాలు చేస్తున్నారని మరో ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శించారు.

loader