అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించారు. ఎంపిగా ఉన్న మూడున్నరేళ్ళలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి చేయలేనపుడు ఎంపిగా ఎందుకు కొనసాగాలంటూ ఆయన ప్రశ్నించారు. అనంతపురం పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు కూడా చేయలేకపోయానన్నారు. అదేవిధంగా చాగల్లుకు కూడా మంచినీటిని తేలేకపోయాయని బాధపడిపోయారు. అందుకే ఎంపిగా ఉండీ ఉపయోగం లేదుకాబట్టే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించారు. ఎంపిగా ఉన్న మూడున్నరేళ్ళలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి చేయలేనపుడు ఎంపిగా ఎందుకు కొనసాగాలంటూ ఆయన ప్రశ్నించారు. అనంతపురం పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు కూడా చేయలేకపోయానన్నారు. అదేవిధంగా చాగల్లుకు కూడా మంచినీటిని తేలేకపోయాయని బాధపడిపోయారు. అందుకే ఎంపిగా ఉండీ ఉపయోగం లేదుకాబట్టే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే బుధవారం నాడు తాను రాజీనామాను చేయనున్నట్లు కూడా జెసి దివాకర్ రెడ్డి తెలిపారు.

జెసి రాజీనామా ప్రకటన చేయటంతో టిడిపిలో ఒక్కసారిగా సంచలనం మొదలైంది. జెసి తన పదవికి రాజీనామా చేస్తారంటూ కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నప్పటికీ అదంతా ఉత్త ప్రచారమే అనుకున్నారు. అయితే, స్వయంగా రాజీనామా గురించి జెసినే ప్రకటించటంతో పార్టీలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. నిజానికి అభివృద్ధి పనులు చేయలేకపోతుండటమే రాజీనామాకు కారణమైతే చాలా మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిందే అనటంలో ఎవరికీ సందేహాలు లేదు. కానీ జెసి విషయం వేరు. ఎందుకంటే, అనంతపురం టిడిపి ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరితో ఆయనకు ఏమాత్రం పడటం లేదు.

ఈ విషయంలో చంద్రబాబునాయుడు ముందు ఎన్నిసార్లు పంచాయితీ జరిగినా ఉపయోగం లేకపోయింది. దానికితోడు జిల్లాలోని ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువమంది జెసికి పూర్తిగా వ్యతిరేకం. దాంతో ఒక్క పని కూడా జెసికి కావటం లేదు. అదంతా మనసులో పెట్టుకున్న జెసి చివరకు రాజీనామా చేయటం ఒకటే మార్గంగా అనుకున్నారు. అంటే టిడిపిపైనో లేక చంద్రబాబునాయుడు పైనో నిరసనగానే బావించవచ్చు. రాజీనామా విషయాన్ని ముందుగా ప్రకటించారు కాబట్టి అందుకు కట్టుబడుతారో లేదో చూడాలి.