న్యూఢిల్లీ: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ రెచ్చిపోయారు. ఏపీ రాజధాని అమరావతి లేకుండా కేంద్ర హోంశాఖ ఇండియా మ్యాప్ విడుదల చేయడంపై మండిపడ్డారు. ఆంధ్రుల రాజధాని అయిన అమరావతికి మ్యాప్ లో చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇటీవల కేంద్రహోంశాఖ విడుదల చేసిన ఇండియా మ్యాప్ లో అమరావతికి చోటు కల్పించకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించినట్లేనని ఆరోపించారు. తమనే కాదని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోదీని సైతం కేంద్రం అవమానించిందని గల్లా జయదేవ్ ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేకుండానే కేంద్ర హోంశాఖ భారతదేశ చిత్రపటం విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ ఏపీ ప్రజలను అవమానించిందన్నారు. కేంద్రం చేసిన తప్పును సరిదిద్దుకోవాలని హితవు పలికారు. 

భారత చిత్రపటంలో ఏపీ రాజధాని అమరావతి లేకపోవడం చూసి ఆశ్చర్యానికి గురయ్యామన్నారు. తమ రాజధాని లేకుండా మ్యాప్ విడుదల చేయడం తమను అవమానించినట్లేనన్నారు. తమతోపాటు ప్రధాని నరేంద్రమోదీని కూడా అవమానించారన్న విషయాన్ని కేంద్రం గమనించాలన్నారు. 

ఈ చిత్రపటం నూతన రాష్ట్రంలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కేంద్రప్రభుత్వం తక్షణమే తమ తప్పును సరిదిద్ది చూతన చిత్రపటం విడుదల చేయాలని గల్లా జయదేవ్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. 

టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ఆలస్యంపై జీరో అవర్ లో చర్చ చేపట్టాలని నోటీసు ఇచ్చారు. అందులో భాగంగా రాజధానిపై చర్చ జరిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కొత్త ఇండియన్ మ్యాప్ నుంచి అమరావతి మాయం: ఏపీ రాజధానిపై క్లియర్

మ్యాప్‌లో అమరావతి గల్లంతు: చంద్రబాబు సరే, ఆరు నెలల జగన్ వైఖరి వల్లనే సందేహాలు...