కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ రోజుకి ఆయన దీక్ష ఐదవ రోజుకి చేరుకుంది. ఇవాళ ఆయనను పరీక్షించిన వైద్యులు రమేశ్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని తెలిపారు.. రమేశ్, రవి ఇద్దరూ బరువు తగ్గారని.. చాలా నీరసంగా ఉన్నారని... షుగర్ లెవల్స్, బీపీ పడిపోయాయని తెలిపారు. రమేశ్ దీక్షకు మద్ధతు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు, అభిమానులు కడపకు తరలివస్తున్నారు.. ఉదయం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, సాయినాథ్ గౌడ్ తదితరులు వచ్చి రమేశ్‌ను పరామర్శించి.. ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు.