Asianet News TeluguAsianet News Telugu

నా భార్య డైరెక్టరే కాదు, తప్పుడు సెర్చ్ వారంట్: సీఎం రమేష్

 రాజకీయ కక్షతోనే  తన ఇంటిపై, కార్యాలయాల్లో కూడ  ఐటీ సోదాలు  జరిగాయని సీఎం రమేష్ మరోసారి ఆరోపించారు. ఈ విషయమై  తాను న్యాయపోరాటం చేస్తానని ఆయన తెలిపారు.

TDP MP CM Ramesh briefs on income tax raids
Author
Hyderabad, First Published Oct 14, 2018, 1:18 PM IST


హైదరాబాద్: రాజకీయ కక్షతోనే  తన ఇంటిపై, కార్యాలయాల్లో కూడ  ఐటీ సోదాలు  జరిగాయని సీఎం రమేష్ మరోసారి ఆరోపించారు. ఈ విషయమై  తాను న్యాయపోరాటం చేస్తానని ఆయన తెలిపారు.

ఆదివారం నాడు హైద్రాబాద్ టీడీపీ కార్యాలయంలో సీఎం రమేష్  మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు సాక్ష్యాలను కూడ తీసుకొచ్చాననని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ అధికారులను  సాక్షులుగా తీసుకొచ్చారని తనకు ఐటీ అధికారులు వచ్చారని  ఐటీ అధికారులు తనకు చెప్పారన్నారు. 

తన భార్య పేరున సెర్చ్ వారంట్ తీసుకొచ్చారని సీఎం రమేష్ చెప్పారు.  రిత్విక్  అగ్రోఫామ్స్‌లో తన భార్య డైరెక్టర్‌గా ఉన్నారని తప్పుడు  సెర్చ్ వారంట్  తీసుకొచ్చారని ఐటీ అధికారులు తెలిపారు.

ఈ అగ్రోఫామ్స్‌లో తన భార్య డైరెక్టర్ కాదన్నారు. తన భార్య డైరెక్టర్ కాదన్నారు. తప్పుడు కంపెనీ పేరుతో వారంట్ తెచ్చారని ఆయన చెప్పారు.  సరైన సమాధానం చెప్పకుండానే సోదాలు నిర్వహించారని  ఆయన తెలిపారు.

దేశ వ్యాప్తంగా 25 చోట్ల సోదాలు నిర్వహించారని  సీఎం రమేష్ చెప్పారు. తన చిన్ననాటి స్నేహితులను కూడ వదిలిపెట్టలేదన్నారు. గతంలో కూడ  పలుమార్లు కూడ ఐటీ అధికారుల సోదాలు  జరిగాయన్నారు.

ఐటీ అధికారుల సోదాలు పూర్తైన  తర్వాత తాను మీడియా ముందుకు  రావాలని  భావించి మూడు రోజలు పాటు మౌనంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. ఐటీ అధికారుల పంచనామాలు ఉన్నాయన్నారు.

ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కవారి వద్ద ఉన్న వారి రూ.3లక్షల53 వేలు ఉన్నాయన్నారు.  ఇందులో రూ.2 లక్షల దేవుడి ముడుపులు ఉన్నాయన్నారు. తమ కుటుంబసభ్యుల బ్యాంకు అకౌంట్ పుస్తకాలు లభ్యమయ్యాయన్నారు.


కంప్యూటర్ హర్డ్ డిస్క్‌లో  సినిమాలను  డౌన్‌లోడ్ చేసుకొనేవారన్నారు.  సుమారు 300 సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొన్నారని చెప్పారు.  బ్యాంకు అకౌంట్లు  కీలకపత్రాలు అవుతాయా అని ఆయన ప్రశ్నించారు.

గత ఏడాది రిత్విక్ కంపెనీ రూ.1300 కోట్లు టర్నోవర్ అయితే, ఈ ఏడాది రూ1500 కోట్లు టర్నోవర్ అయ్యే అవకాశం ఉందన్నారు. పీఎసీ సభ్యుడిగా తాను పోటీ చేయకూడదని బీజేపీ నేతలు ఒత్తిడి చేసినా తాను పోటీ చేస్తే అన్ని పార్టీలు తనకు మద్దతుగా  ఓటు వేశారని చెప్పారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇలా ఫలితం ఉంటుందని తన కుటుంబసభ్యులకు ఐటీ అధికారులు చెప్పారని ఆయన తెలిపారు.

ఏ కారణంతో సోదాలు నిర్వహించారో చెప్పలేదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే  ఎందుకు ఐటీ సోదాలు జరిగాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  తాను ఈ అధికారులపై సీవీసీపై ఫిర్యాదు చేస్తానని సీఎం రమేష్ చెప్పారు.  

తన భార్యకు ఎలాంటి వ్యాపారాలు లేవు...  విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తానని సీఎం రమేష్ హెచ్చురించారు. పరోక్షంగా తనను బెదిరించారన్నారు. తన తల  తీసినా కూడ తాను బెదిరించనని ఆయన చెప్పారు. ఈ బెదిరింపులకు తాను బెదిరిపోనని చెప్పారు. 

 

సంబంధిత వార్తలు

సీఎం రమేష్ ఇంట్లో, కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు

నాలుగేళ్లలో రూ.200కోట్లు చెల్లించా:సీఎం రమేష్

రెండో రోజూ ఐటి సోదాలు: వేలిముద్రల కోసం హైదరాబాద్ కు సిఎం రమేష్

Follow Us:
Download App:
  • android
  • ios