Asianet News TeluguAsianet News Telugu

నాలుగేళ్లలో రూ.200కోట్లు చెల్లించా:సీఎం రమేష్

రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. తన కంపెనీలపైనా ఇంటిపైనా ఐటీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండోరోజు ఐటీ సోదాల్లో భాగంగా డిజిటల్ లాకర్లు తెరిచేందుకు ఢిల్లీలో ఉన్న ఎంపీ సీఎం రమేష్ కు ఐటీ అధికారులు ఫోన్ చేశారు. డిజిటల్ లాకర్లు తెరిచేందుకు హైదరాబాద్ రావాలని కోరారు. 

cm ramesh comments on it raids
Author
Hyderabad, First Published Oct 13, 2018, 7:04 PM IST

హైదరాబాద్: రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. తన కంపెనీలపైనా ఇంటిపైనా ఐటీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండోరోజు ఐటీ సోదాల్లో భాగంగా డిజిటల్ లాకర్లు తెరిచేందుకు ఢిల్లీలో ఉన్న ఎంపీ సీఎం రమేష్ కు ఐటీ అధికారులు ఫోన్ చేశారు. డిజిటల్ లాకర్లు తెరిచేందుకు హైదరాబాద్ రావాలని కోరారు. 

ఐటీ అధికారుల ఆదేశాలతో ఎంపీ సీఎం రమేష్ హైదరాబాద్ చేరుకున్నారు. తన కంపెనీలో ఎక్కడా ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు. తన కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టులు, పనులకు లెక్కలు ఉన్నాయన్నారు. ఢిల్లీకి పెద్ద ఎత్తున  డబ్బులు తరలిపోయాయన్న వార్తల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో తాము ప్రాజెక్టులు చేస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో రూ.200కోట్లకు పైగా పన్ను చెల్లించానని అన్నీ సక్రమంగానే ఉన్నాయన్నారు. 

ఐటీ అధికారులకు తాను సహకరిస్తానని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. తనను డిజిటల్ లాకర్లు తెరిచేందుకు రమ్మన్నారని అందుకే తాను వచ్చానని తెలిపారు. మరోవైపు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సవాల్ కు సీఎం రమేష్ స్పందించారు. జీవీఎల్ సవాల్ కు తాను రెఢీ అన్నారు. ప్లేస్,టైం చెప్తే తాను రెడీగా ఉంటానని సీఎం రమేష్ తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios