రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. రైతాంగం అంతా ఒక్కటై ఈ దగా మీటర్లు మాకొద్దు అంటున్నా జగన్ రెడ్డి గారు బలవంతంగా మీటర్ల మోత పెడుతున్నారని మండిపడ్డారు.

ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు మీటర్లు పెట్టడానికి మాత్రం అంగీకరించేది లేదని రైతులు ఆందోళన చేస్తున్నారని లోకేశ్ గుర్తుచేశారు.

ఓ పక్క నిరసనలు జరుగుతున్నా.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం మార్తాడు గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అధికారులు ప్రయత్నించడం దారుణమని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ ఎద్దేవా చేశారు.