ప్రభుత్వంపై ఎంఎల్సీ సంచలన వ్యాఖ్యలు

First Published 4, Apr 2018, 2:21 PM IST
Tdp mlc made sensational comments on government
Highlights
శాసనమండలిలో టిడిపి ఎంఎల్సీ చేయటంతో పార్టీలో కలంకలం రేగింది.

చివరకు ప్రభుత్వ విధానంపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులే మండిపడుతున్నారు. ప్రతిపక్షానికి చెందిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు అనాల్సిన మాటలు చేయాల్సిన ఆరోపణలను తాజాగా టిడిపి వాళ్ళే చేస్తున్నారు. అదికూడా శాసనమండలిలో టిడిపి ఎంఎల్సీ చేయటంతో పార్టీలో కలంకలం రేగింది.

 

తెలుగుదేశం పార్టీ నేత కరణం బలరాం మండలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పెట్టుబడిదారులను ఎందుకు వెనక్కు పంపుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ పటంలో ప్రకాశం జిల్లాను పక్కనబెట్టారని కరణం బలరాం ఆవేదన వ్యక్తం చేశారు.

loader