జగన్ నడిచిన నేలను శుద్ది చేస్తారట

TDP MLC budha venkanna wants to clean all areas Jagan set his feet for Padayatra
Highlights

  • వైసీపీ అదినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ఆ నేలమొత్తాన్ని టిడిపి శుద్ది చేస్తుందట.  
  • టిడిపి ఎంఎల్సీ బుద్దా వెంకన్న శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేయటానికే వీల్లేదన్నారు.

వైసీపీ అదినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ఆ నేలమొత్తాన్ని టిడిపి శుద్ది చేస్తుందట.  టిడిపి ఎంఎల్సీ బుద్దా వెంకన్న శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేయటానికే వీల్లేదన్నారు. ఎందుకంటే, పొరుగు రాష్ట్రంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న జగన్ ఏపిలో పాదయాత్ర చేయటమేంటన్నది వెంకన్న పాయింట. ఆస్తులను కాపాడుకోవటం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్న విషయాన్ని వైసీపీ నేతలందరూ తెలుసుకోవాలని ఓ పిలుపు కూడా ఇచ్చారు బుద్దా.

ఈడి జప్తు చేసిన ఆస్తులపైనే కాకుండా తానే తప్పు చేయలేదని జగన్ ఎందుకు చెప్పటం లేదని వెంకన్న లా పాయింటే లేవదీసారు. మరి, ‘ఒటుకునోటు’ కేసులో ఆ పాయింట్ నే కదా వైసీపీ నిలదీస్తోంది. ‘బ్రీఫ్డ్ మీ’ గొంతు తనది కాదని చంద్రబాబును చెప్పమని అడుగుతున్నా మరి చంద్రబాబునాయుడు ఎందుకు మాట్లాడటం లేదు? పాపప్రక్షాళన కోసం జగన్ పాదయాత్ర కాకుండా మోకాళ్లయాత్ర చేయాలని కూడా వెంకన్న సూచించారు.

loader