Asianet News TeluguAsianet News Telugu

ఆ కథేంటో తేల్చుకుందాం రండి: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్

మీ ముఖ్యమంత్రిగారి చెత్త నిర్ణయాలతో ప్రజలు కడుపు మండి మాట్లాడుతుంటే వారు పెయిడ్ ఆర్టిస్టులని అవమాన పరుస్తారా? పెయిడ్ ఆర్టిస్టుల కంపెనీ పెట్టింది మీ జగన్ గారే

tdp mlc buddha venkanna challenges ysrcp mp vijayasai reddy over paid artists
Author
Vijayawada, First Published Nov 12, 2019, 3:56 PM IST

వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ప్రతిపక్ష నేతగా నిర్ణయాత్మక పాత్ర అంటే ఏంటి విజయసాయి రెడ్డి గారు? ట్రైన్లు తగులబెట్టడం, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పంటలు తగులబెట్టడం, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడమా?’ అంటూ మండిపడ్డారు.

‘అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని నరికేయండి, కాల్చేయండి, అని చొక్కా చించుకోవడమేనా? అని నిలదీశారు. ‘మీ ముఖ్యమంత్రిగారి చెత్త నిర్ణయాలతో ప్రజలు కడుపు మండి మాట్లాడుతుంటే వారు పెయిడ్ ఆర్టిస్టులని అవమాన పరుస్తారా? పెయిడ్ ఆర్టిస్టుల కంపెనీ పెట్టింది మీ జగన్ గారే.

జీతాలు చెల్లించి మరీ మీ ఆర్టిస్టులను ప్రజల మీదకి వదిలారు ఇప్పుడు వారందరికీ ప్రజా ధనం దోచిపెడుతున్నారు. లిస్ట్ వదలమంటారా? ఆర్టిస్టుల బాగోతం ఎంటో తేల్చుకుందాం.’ అంటూ వ్యాఖ్యానించారు. 

Also Read:కోడెల, యరపతినేని లు కీచకులు, బాబూ! పెయిడ్ ఆర్టిస్టుల స్కీమ్ అభాసుపాలే: రోజా వార్నింగ్

వైయస్ జగన్ జనరంజకంగా పాలన అందిస్తుంటే దాన్ని ఓర్వలేక తెలుగుదేశం పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వందరోజుల పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. కృష్ణానదిలో నీళ్లు నిండి రైతులు అంతా హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ కడుపుమంటతో పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. 

పల్నాడు ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంటుంటే దానిపై రాజకీయం చేసేందుకు టీడీపీ శిబిరాల స్కీమ్ ను తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాదరావు లాంటి కీచకుల పాలన పోవడంతో అక్కడి ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ రోజా చెప్పుకొచ్చారు.

అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో చలో ఆత్మకూరు అంటూ వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారని విమర్శించారు. వైసీపీ బాధితుల శిబిరం ఇప్పుడు అవసరం లేదన్నారు. 

Also Read:గతంలో నన్ను అరెస్ట్ చేయలేదా...? చంద్రబాబు మీ జిమ్మిక్కులు తెలుసు: బొత్స సత్యనారాయణ ఫైర్

అవసరం లేకున్నా వైసీపీ బాధితుల శిబిరం అంటూ నానా హంగామా చేస్తున్న చంద్రబాబు గత ఐదేళ్లుగా కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమా, దేవినేని ఉమా మహేశ్వరరావు, అచ్చెన్నాయుడులాంటి వారి అరాచకాల వల్ల ఎంతో మంది బలైతే ఆ సమయంలో ఎందుకు పునరావాస శిబిరాలు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

నారాయణ కళాశాలల్లో చదువుల సరస్వతులు అన్యాయంగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వారిని పరామర్శించేందుకు ఎందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. 

పబ్లిసిటీ పిచ్చికోసం గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలితీసుకున్న చంద్రబాబు ఆనాడు ఎందుకు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయలేదో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలన అంతమెుందించేందుకే వైసీపీకి ప్రజలు అఖండవిజయాన్ని అందించారని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios