వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని టీడీపీ ఎమ్మెల్యే బిటెక్ రవి హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా సాగాలంటే సీబీఐకి అప్పగించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

వైయస్ వివేకానందరెడ్డి హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి. వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం ఉన్నా ఎన్ కౌంటర్ చేసుకోవచ్చు అంటూ సవాల్ విసిరారు. 

వైయస్ వివేకాందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సిట్ విచారణకు హాజరైన ఆదినారాయణరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. సిట్ బృందం ఇచ్చిన నోటీసులో భాగంగానే తాను విచారణకు హాజరైనట్లు తెలిపారు.

వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు తాను విజయవాడలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమంటూ స్పష్టం చేశారు. వైయస్ వివేకా హత్య కేసులో ప్రమేయం ఉన్నవారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే వైయస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి. వివేకా హత్యపై ఆనాడు జగన్ సీబీఐ విచారణ కోరిన సంగతిని గుర్తు చేశారు.