కొత్త వివాదంలో టిడిపి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన

TDP MLA Uppuleti Kalpana in new controversy
Highlights

ఇలా చేశారెందుకబ్బా ?

ఆంధ్రాలోని కృష్ణా జిల్లా పామర్రు టిడిపి మహిళా ఎమ్మెల్యే చేసిన ఒక పని ఆమెకే కాకుండా పార్టీ అధినేత చంద్రబాబుకూ తలనొప్పి తెచ్చిపెట్టింది. బాబుకు మద్దతు ఇవ్వాలనుకుని ఆమె ఆర్భాటంగా చేసిన పనితో బాబే తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడింది. ఇంతకూ పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన చేసిన పనేందబ్బా అనుకుంటే చదవండి స్టోరీ.

చంద్రబాబు తన బర్త్ డే వేళ ధర్మపోరాట దీక్ష చేపట్టారు. 12గంటలపాటు ఉపవాస దీక్ష చేశారు. ఆయన దీక్షకు మద్దతుగా ఆంధ్రా అంతటా దీక్షలు, సైకిల్ ర్యాలీలు జరిగాయి. హోదా కోసం ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు జ్వరంతో ఉండి కూడా దీక్ష చేశారు. ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. హోదా కోసం పోరాటం చేశారు.

ఈ క్రమంలో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఒక హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అందులో రాసిన సమాచారం టిడిపికి మింగుడు పడని రీతిలో ఉంది. అందులో ఏమందంటే?? ‘‘ప్రత్యేక హోదా సాధనకు నిరసనగా సైకిల్ ర్యాలీ’’ అని ఉంది. ఈ పేరుతో ఆమె తన నియోజకవర్గంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ చూసి జనాలు నవ్వుతున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

loader