కాపులకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లిస్తామనడం సాధ్యం కాదు

కాపులకు విద్యా,ఉద్యోగలలో మాత్రమే రిజర్వేషన్లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రకటించడం పట్ట బిసి నేత , తెలంగాణా టిడిపి ఎమ్మెల్యే ఆర్ క్రిష్ణయ్య అసమ్మతి తెలిపారు.

కాపు రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లవని అన్నారు.

 ఇలాంటి ఏర్పాటు సాంకేతిక సరికాదని, ఆచరణ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజు క్రిష్ణయ్య విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

ఏకులాన్నైనా బిసి లలో చేరిస్తే ..వారికి బిసిలకు వర్తించే అన్ని అన్ని అంశాలు వర్తిస్తాయి, ఇందులో పాక్షికంగా వర్తించడమనేదేమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామనడం రాజకీయ హామి అని దానిని అమలు చేయాలంటే రాజ్యాంగానికి లోబడే చేయాలి తప్ప ఇష్టాను సారం చేయడం కుదరదని కూడా ఆయన చెప్పారు.

బిసి రిజర్వేషన్లను 27శాతం 50 శాతం కి పెంచాలని ఏపి ప్రబత్వానికి విజ్ఙప్తి చేశారు.

తెలంగాణా ప్రభుత్వం మా డిమాండ్ పై స్పందించిందని కూడా క్రిష్ణయ్య వెల్లడించారు.

ఆర్ కృష్ణయ్య చేసిన మరిన్ని డిమాండ్లు

***బిసి క్రిమిలేయర్ నిబందన ,చట్టసబల్లో 50% బిసిలకు రిజర్వేషన్లకై కేంద్రం పై ఓత్తిడి తీసుకురావడానికి చంద్రబాబు ప్రబుత్వం అఖిలపక్షాన్ని తీసుకువెల్లాలి

***కేంద్రం గణాంకాలలో 14 % మంది బిసిలు మాత్రమే చట్ట సబలలో ప్రాతినిద్యం వహిస్తున్నారు

***బిసిలకు ఇచ్చేది బిక్ష కాదు అది రాజ్యాంగం హక్కు

***ప్రతీ నియొజకవర్గంలో బీసి హాస్టళ్లు ఏర్పాటు చేయాలి

మరిన్ని తాజా వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి