రాజధాని ప్రకటనకు ముందు భూములు కొనుగోలు చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిలిచ్చేస్తా: పయ్యావుల


రాజధాని ప్రకటన తర్వాత అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్టుగా రుజువు చేస్తే ఆ భూములను ఎవరికివ్వాలంటే వారికి ఇస్తానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు. 
 

TDP MLA Payyavula Keshav  Challenges To YCP Over Amaravati Lands


అమరావతి: రాజధాని ప్రకటన తర్వాత తాను అమరావతిలో భూములు కొనుగోలు చేశానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు. ఒకవేళ రాజధాని ప్రకటనకు ముందు తాను భూములు కొనుగోలు చేసినట్టుగా రుజువు  చేస్తే ఆ భూమిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచించిన వ్యక్తికి రాసిస్తానని  కేశవ్ స్పష్టం చేశారు. 

గురువారం నాడు పాలనా వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా రాజధానిలో పయ్యావుల కేశవ్ భూములు కొన్న అంశంపై చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. రాజధానిలో   టీడీపీ నేతలు భూములు ఎలా కొనుగోలు చేశారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారన్నారు.   ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2014 నుండి ఇదే మాట మాట్లాడుతున్నారన్నారు. ఈ విషయమై ఇప్పటికే అసెంబ్లీలో మూడు దఫాలు చర్చలు జరిగిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు.

రాజధాని అమరావతిపై ఆనాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసిన  తాను రాజధానిలో భూములు కొనుగోలు చేసినట్టుగా పయ్యావుల కేశవ్ చెప్పారు రాజధానలో భూములు కొనుగోలు చేసినట్టుగా తాను ఎన్నికల అఫిడవిట్ లో కూడా  ప్రకటించినట్టుగా పయ్యావుల కేశవ్ చెప్పారు. తన ఆస్తుల నుండి రాజధానిలో భూమిని కొనుగోలు చేశానన్నారు.. అమరావతిలో రాజధాని గురించి ప్రకటించిన తర్వాత భూములు కొనుగోలు చేస్తే తప్పేం ఉందని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని భూములపై ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టిందన్నారు.బినామీల పేరుతో భూములు కొనుగోలు చేసినట్టుగా అనుమానాలుంటే  బినామీ చట్టం కింద తన భూములు తీసుకోవాలని కేశవ్ సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ తరపున రాజధానిలో తాను భూములు  కొనుగోలు చేసినట్టుగా సుప్రీంకోర్టులో కేసు వేశారని ఆయన గుర్తు చేశారు.సుప్రీంకోర్టులో వైసీపీ కేసు ఓడిపోయిందన్నారు.

 వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిందని ఆరోపణలు చేశారని కేశవ్ చెప్పారు. ఈ విషయమై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసిన కేసుల్లో చీవాట్లు తిన్నారని పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. 2014లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ను పయ్యావుల కేశవ్ సభలో చూపించారు. రాజధాని ప్రకటన తర్వాత భూ యజమానుల మార్పిడిని పరిగణనలోకి తీసుకోవద్దని ఈ సర్క్యులర్ చెబుతుందన్నారు. ఇంత స్పష్టంగా నిబంధనలు అమలు చేసినప్పటికీ ఎలా దోపిడి జరుగుతుందని  కేశవ్ ప్రశ్నించారు. 

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన  మూడేళ్ల  కాలంలో కూడా విశాఖపట్టణంలో జరిగిన భూముల క్రయ విక్రయాలపై కూడా విచారణ జరిపించాలని సీఎం జగన్ ను పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. రాజధాని ప్రకటనకు ముందు తాను భూములు కొనుగోలు చేసినట్టుగా నిరూపించాలని  ఆయన డిమాండ్ చేశారు. 

also read:మూడు రాజధానులంటే తలను మూడు ముక్కలు చేయడమే: ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిమ్మల

2014 సెప్టెంబర్ 4 వ తేదీన రాజధాని ప్రకటన జరిగిందని పయ్యావుల కేశవ్ చెప్పారు. కానీ తాను మాత్రం అమరావతిలో నవంబర్ లో భూమిని కొనుగోలు చేసినట్టుగా పయ్యావుల కేశవ్ వివరించారు.  ఈ విషయమై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకున్నారు . అప్పటి ప్రభుత్వం 2014 డిసెంబర్ 30న   అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్టుగా  జీవో జారీ చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. అయితే రాజధాని ప్రకటనకు ముందే  టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని మంత్రి ఆరోపించారు. ఈ మేరకు మరోసారి టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని చెప్పారు.  అయితే ఈ సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పయ్యావుల కేశవ్ కోరారు. కేశవ్ కు మద్దతుగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వెల్ లోకి రావడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios