Asianet News TeluguAsianet News Telugu

నియోజకవర్గం కోసమే: జగన్‌తో భేటీపై మద్దాలిగిరి వ్యాఖ్యలు

నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి.

TDP MLA Maddali Giri praises cm ys jagan over english medium
Author
Amaravathi, First Published Dec 30, 2019, 5:57 PM IST

నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గ సమస్యలతో పాటు సీఎఫ్ఎంఎస్ బకాయిల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు.

దీనిపై సీఎం వెంటనే స్పందించి రూ.25 కోట్ల బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని గిరి వెల్లడించారు.

Also Read:అమరావతి:జగన్‌ సర్కార్‌కు అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగిందని.. అలాంటి విప్లవం తిరిగి జగన్ పాలనలోనే వస్తుందనే నమ్మకం ఉందని గిరి ఆశాభావం వ్యక్తం చేశారు.

తమ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పాలనే ఆలోచనలో ప్రస్తుతం పేద ప్రజలు ఉన్నారని.. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మద్దాలి గిరి విమర్శించారు.

Also Read:బాబుకు షాక్: వైసీపీలో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యే మద్దాలిగిరి, క్యూలో మరికొందరు..?

రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని మద్దాలి గుర్తుచేశారు. రాజధాని అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన ఆలోచన ఉందని.. లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ఆయన తనతో చెప్పారని మద్దాలిగిరి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios