గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి త్వరలో వైసీపీలో చేరనున్నారు. సోమవారం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మద్దాలిగిరి కలిశారు. 

Also Read:అమరావతిలో బాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్: బొత్స సంచలనం

ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన గిరి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరికి గల్లా జయదేవ్‌ దగ్గరుండి టికెట్ ఇప్పించారు. వైసీపీ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడే ఆయన వేగంగా అధిష్టానం వద్ద మార్కులు వేయించుకున్నారు.

కాగా గిరి ఎన్నికను రద్దు చేయాలంటూ వైసీపీ నేత, ఆయన ప్రత్యర్ధి చంద్రగిరి ఏసురత్నం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  ఆయన మొత్తం ఐదు పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఎగవేతకు పాల్పడ్డారని ఏసురత్నం పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read:Year roundup 2019:విపక్షాల విమర్శలకు జగన్ చెక్, విప్లవాత్మక మార్పులు

దీనితో పాటు కౌంటింగ్ నాడు 4040 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కేవలం 312 మాత్రమే చెల్లుబాటు అయినట్లు ఆర్‌వో ధ్రువీకరించారని గుర్తుచేశారు. మద్దాలి గిరి వైసీపీలో చేరితే  గుంటూరు జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన వారిలో రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఒక్కరే మిగులుతారు.