పసిబిడ్డ పరిస్ధితిని చూసి చలించిన కారణంగానే బిడ్డ ఈరోజు ప్రాణాలతో నిలిచింది. ఓ ఎంఎల్ఏ స్పందించిన తీరుతో బిడ్డ తల్లి, దండ్రులు సంతోషపడిపోతున్నారు. విషయం ఏమిటంటే, అడిగిన వెంటనే సాయంచేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావుకు రుణపడి ఉంటామని విజయవాడలోని రాణిగారితోటకు చెందిన ఆదిలక్ష్మి కృతజ్ఞత తెలిపారు.

డివిజన్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను ఎంఎల్ఏ పంపిణీ చేశారు. డివిజన్‌ అధ్యక్షుడు డానియల్‌ మాట్లాడుతూ ఆదిలక్ష్మి దంపతుల 5 నెలల బిడ్డ గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు.

దీనిపై గద్దె స్పందించి ఆపరేషన్‌కు అయ్యే రూ.2 లక్షల్లో ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.1.65 లక్షలు, ఆయన సొంత నిధులు రూ.35 వేలు అందజేశారు. దాంతో పసిబిడ్డకు వైద్యులు ఆపరేషన్ చేసి ప్రాణాపాయం నుండి కాపాడారు. అదే సంతోషంతో ఆరోగ్యంగా ఉన్న బిడ్డను  ఎంఎల్ఏకు చూపించారు.