మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బండారు మాట్లాడిన దానిలో తనకు తప్పేమీ కనిపించడం లేదని.. గతంలో వైసీపీ నేతలు ఏకంగా అసెంబ్లీలోనే తెలుగుదేశం నాయకులపై అసభ్య వ్యాఖ్యలు చేశారని చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు. బండారు మాట్లాడిన దానిలో తనకు తప్పేమీ కనిపించడం లేదని.. గతంలో వైసీపీ నేతలు ఏకంగా అసెంబ్లీలోనే తెలుగుదేశం నాయకులపై అసభ్య వ్యాఖ్యలు చేశారని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బండారును తప్పుబడుతున్న వారు అప్పుడేం అయ్యారని చింతమనేని ప్రశ్నించారు.
అప్పుడు మాటలకు తప్పుగా కనిపించడం లేదు కానీ.. ఇప్పుడు రోజాపై సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తప్పుగా కనిపిస్తున్నాయా అని ప్రభాకర్ ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు ముందు వైసీపీ నేతలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల సాయంతో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ నేతల నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు అందరిపైనా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని.. అందరినీ భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని చింతమనేని ఫైర్ అయ్యారు.
Also Read: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్ (వీడియో)
కాగా.. బండారు సత్యనారాయణమూర్తిని సోమవారంనాడు రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నోటీసులు తీసుకోకుండా తలుపులు వేసుకొని బండారు సత్యనారాయణమూర్తి నిరసనకు దిగారు. తలుపులు బద్దలు కొట్టి మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్ ను దూషించిన కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు పోలీసులు.