శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై 120 రోజులుగా దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. పాలనను గాలికొదిలేసిన సీఎం వైయస్ జగన్ టీడీపీని ఎలా ఇరుకున పెట్టాలా అనే అంశంపైనే ఫోకస్ పెట్టినట్లు కనబడుతుందన్నారు. 

రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం చట్టబద్దంగా వ్యవహరించడం లేదన్నారు. తన అరెస్ట్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. 

ఇకపోతే మంగళవారం రాత్రి టెక్కలిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అరెస్ట్ ను నిరసిస్తూ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పోలీస్ స్టేషన్లోనే నిరసనకు దిగారు. గాంధీ చిత్రపటంతో తన నిరసన తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని బుధవారం తెల్లవారు జామున ఆయన నివాసంలో వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. 
 

ఈ వార్తలు కూడా చదవండి

టెక్కలిలో ఉద్రిక్తత: పోలీస్‌స్టేష‌న్‌లోనే అచ్చెన్నాయుడు నిరసన