Asianet News TeluguAsianet News Telugu

‘ఆది’లోనే వివాదాలా?

మూడేళ్ళ పాటు మంత్రిగా ప్రత్తిపాటి పుల్లారావు కూడా సంతకం చేయటానికి ఇష్టపడని ఫైల్ పై మంత్రి కాగానే ఆదినారాయణ రెడ్డి సంతకం చేసేయటంతో ఉన్నతాధాకారులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

TDP minister Adis decision lands him in major controversy

మంత్రి ఆదినారాయణ రెడ్డి బాగా దూకుడుగా ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు తసుకోగానే వివదాస్పద ఫైళ్ళపై సంతకాలు చేయటం చూస్తుంటే దూకుడు నిజమే అనిపిస్తోంది. ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్న మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవహారాన్ని మంత్రి ఒకే దెబ్బకు తేల్చేయటంతో వ్యవహారం రచ్చకెక్కింది. మూడేళ్ళ పాటు మంత్రిగా ప్రత్తిపాటి పుల్లారావు కూడా సంతకం చేయటానికి ఇష్టపడని ఫైల్ పై మంత్రి కాగానే ఆదినారాయణ రెడ్డి సంతకం చేసేయటంతో ఉన్నతాధాకారులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

అసలింతకీ ఏం జరిగిందంటే, దాదాపు మూడేళ్ళ క్రితం సిసిఐ ద్వారా జరిగిన పత్తి కొనుగోళ్ళలో సుమారు రూ. 800 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణులొచ్చాయి.  ప్రభుత్వం జరిపిన ప్రాధమిక విచారణలో 27 మంది మార్కిటింగ్ శాఖ ఉద్యోగులు బాధ్యులుగా తేలటంతో అందరూ సస్పెండ్ అయ్యారు. తర్వాత వీరిలో ఒకరిని ఉద్యోగంలో నుండి తొలగిచారు కూడా. మిగిలిన అందరిపైనా అప్పటి నుండి సస్పెన్సన్ కొనసాగుతూనే ఉంది. సస్పెన్షన్ ఎత్తేయించుకునేందుకు వారు ఎంత ప్రయత్నించానా సాధ్యం కాలేదు. ఎందుకంటే కేసు విచారణ కోర్టులో కూడా నడుస్తోంది కాబట్టి.

అటువంటిది ఆదినారాయణ రెడ్డి మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే తెరవెనుక ఏం జరిగిందో తెలీదుగానీ వెంటనే అందరి సస్పెన్షన్ను ఎత్తేస్తూ ఫైల్ పై మంత్రి సంతకాలు చేసేసారు. దాంతో వారంతా ఉద్యోగాల్లో చేరటానికి రంగం సిద్ధమైపోయింది. విధుల్లో చేరటానికి వారు కార్యాలయానికి వచ్చిన తర్వాత కానీ ఉన్నతాధికరులకు వారిపై సస్పెన్షన్ ఎత్తేసిన విషయం తెలీదట. అంటే అంత గోప్యంగా వ్యవహారం నడిచిందన్నమాట. అయితే, ఎప్పుడైతే ఉద్యోగులు కార్య లయానికి వచ్చారో అప్పుడే వ్యవహారం కూడా రచ్చకెక్కింది. దాంతో మంత్రి నిర్ణయంపై వివాదం మొదలైంది. చివరకు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios