రోజా ఫుల్ టైం కాదు.. పార్ట్ టైం ఎమ్మెల్యే

First Published 5, May 2018, 10:56 AM IST
tdp mahila leaders comments on ycp mla roja
Highlights

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫుల్ టైం కాదు.. పార్ట్ టైం ఎమ్మెల్యే అని టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. వీరు గుంటూరులో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై మండిపడ్డారు. అక్రమాలు, అకృత్యాలు, అత్యాచారాల గురించి రోజా, వైసీపీ నేతలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.  పార్టీ జిల్లా కార్యాలయంలో  జిల్లా అధ్యక్షురాలు పోతురాజు ఉమాదేవి మాట్లాడుతూ మహిళాభ్యుదయం తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు సంయమనం పాటించాల్సిన ప్రతిపక్షం రాజకీయం చేయటం శోచనీయమన్నారు.
 
ప్రధాన కార్యదర్ళి వేణుగుంట రాణి మాట్లాడుతూ దాచేపల్లిలో లైంగికదాడి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా ఉండా ల్సింది పోయి పరామర్శల పేరుతో ప్రతిపక్షం, ఎమ్మెల్యే రోజా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబును, జిల్లా యంత్రాగాన్ని రోజా తప్పు పట్టడం దారుణమన్నారు. లైంగికదాడి నిందితుడు సుబ్బయ్య కుమారుడు చిట్టిబాబు మీ పార్టీ నాయకుడన్న విషయం తెలియదా అంటూ నిలదీశారు. ఈ సమావేశంలో మహిళానేతలు పానకాల వెంకట మహాలక్ష్మి, పుల్లమ్మ, లక్ష్మీనరసమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

loader