వైసీపీ నేతలపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. అసలు లోకేష్ ని విమర్శించే వారికి ఆవగింజలో అరవయ్యో వంత అర్హత ఉందా అని ఆమె ప్రశ్నించారు.

ఎంబీఏ చదివి, ప్రపంచబ్యాంకులో పని చేసిన రికార్డు లోకేశ్ సొంతమన్నారు. విజన్ ఉన్న నాయకుడి తనయుడిగా లోకేశ్‌కు కష్టపడే స్వభావం ఉందన్నారు. కొడాలి నానిపై సైతం దివ్య వాణి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

 ‘‘అయినా  మీలాంటి ఇంగిత జ్ఞానం, సంస్కారం లేని వ్యక్తులతో మాటలు పడుతున్నారు. ఏమండోయ్ కొడాలి గారు.. పుట్టుకతో బంగారు స్ఫూన్‌తో పుట్టిన వ్యక్తి లోకేశ్. పార్టీలు మార్చే వ్యక్తి కాదు. వీళ్లకు వాళ్లకు గ్లాసులు మోసిన వ్యక్తి కాదు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తి కాదు. ఇవన్నీ ఎందుకని ఆయన యూఎస్‌కు వెళితే... వచ్చే ఆదాయం ఎంతో తెలుసా... 50 లక్షల డాలర్లు సంపాదించుకొనే సత్తా ఉంది. అయినా తనను తాను తగ్గించుకుంటూ.. అందరితో కలిసిపోతూ... పని చేసుకుంటూ వెళుతున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ప్రజలు నమ్మి పట్టం కట్టారు. మీమాటలు, వికృత చేష్టలతో వేదనను అనుభవిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేయకండి. అప్పు చేసి పప్పుకూడులా... ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. సీఎం బాధ్యతగా వ్యవహరించడం లేదు’’ అంటూ దివ్యవాణి ఘాటు విమర్శలు చేశారు.