జంగారెడ్డిగూడెం మరణాలు: సచివాలయం నుండి అసెంబ్లీకి టీడీపీ ప్రజా ప్రతినిధుల ర్యాలీ
కల్తీ సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జే బ్రాండ్ మద్యంతో వందలాది మంది చనిపోతున్నారని టీడీపీ సభ్యులు మంగళవారం నాడు అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు.
అమరావతి: కల్తీ నాటు సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జేబ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ వరుసగా ఆరో రోజూ టీడీపీ నేత Nara Lokesh ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది. కోడికత్తి ఫేక్, సారా మరణాలు నిజం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
బాబాయి గుండెపోటు ఫేక్, కల్తీ మద్యం నిజం అంటూ TDP సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ నాటుసారాతో పాటు జె బ్రాండ్‌తో YS Jagan జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు.
రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని మండిపడ్డారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ నిర్వహించింది.