సంచలనం: చెప్పిన పని చేస్తావా ? లేపేసేదా?..టిడిపి నేత వార్నింగ్

First Published 23, Feb 2018, 4:19 PM IST
Tdp leaders threatening officials for certificates
Highlights
  • టిడిపి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయ్.

టిడిపి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయ్. తాము అడిగిన పని చేయకపోయినా లేకపోతే తమకు నచ్చినట్లుండక పోయినా దాడులు చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే, జిల్లాలోని పాయకరావుపేటకు చెందిన ఓ టిడిపి నేతకు వన్యప్రాణులను వేటాడ్డమంటే మహా ఇష్టం.

అలా వేటాడుతూ ప్రభుత్వాధికారులకు దొరికిపోయారు. దాంతో సదరు నేతపై కేసు నమోదు చేయటానికి రంగం సిద్దమైంది. తాను టిడిపి నేతను అని చెప్పినా అధికారులు వినలేదు. దాంతో దౌర్జన్యమే మార్గమని నిర్ణయించుకున్నారు.

దాంతో పాయకరావుపేట మండలం గుంటపల్లిలో మహిళా వీఆర్వోను టీడీపీ నాయకుడు బెదిరించాడు. తాను వన్యప్రాణులను వేటాడలేదని లేఖ రాసివ్వాలని హుకుం జారీ చేశాడు. లేదంటే శాల్తీ గల్లంతవుతుందని బెదిరింపులు మొదలుపెట్టాడు.

నాయకుడి బెదిరింపులకు భయపడిపోయిన విఆర్వో తనను అక్కడినుంచి బదిలీ చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగంలో కొత్తగా చేరిన ఆమెను టీడీపీ నాయకుడు బెదిరించిన విషయం బయటపడడంతో స్థానికంగా చర్చానీయాంశమైంది. కాగా తనపై ఎటువంటి కేసు నమోదు కాకుండా నాయకుడు బాగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

 

loader