అమరావతి: చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ తీసుకొన్న నిర్ణయంపై టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం నాడు ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యానికిఫిర్యాదు చేశారు.

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన టీడీపీ నేతలు ఈసీని కోరితే..... తమ ఫిర్యాదును పట్టించుకోకుండా వైసీపీ ఫిర్యాదు ఆధారంగానే ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈ నెల 6వ తేదీన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగానే రీపోలింగ్ నిర్వహించాలని  నిర్ణయాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు.

ఇదే విషయాన్ని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వద్ద మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ లు ప్రస్తావించారు. తమ అభ్యర్థి ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును కూడ పరిశీలించాలని కూడ టీడీపీ నేతలు సీఎస్ వద్ద ప్రస్తావించారు.

ఈ ఫిర్యాదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఎందుకు వెళ్లిందని కూడ ప్రశ్నిస్తున్నారు. తమ ఫిర్యాదుపై కూడ ఆయా  గ్రామాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ వినతిని కూడ ఈసీకి పంపుతామని సీఎస్ తమకు చెప్పినట్టుగా మంత్రి ఆనంద్ బాబు చెప్పారు.

సంబంధిత వార్తలు

చెవిరెడ్డిని అడ్డుకొన్న ఎన్ఆర్. కమ్మపల్లి గ్రామస్తులు, ఉద్రిక్తత

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి