చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్ బూతుల్లో  రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయంపై   ఆయా గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఐదు  పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది.

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం ఎన్ఆర్ కమ్మపల్లి గ్రామంలోకి బయటి ప్రాంతాల నుండి జనాలను తీసుకొస్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇతర ప్రాంతాల నుండి వైసీపీ నేతలు  జనాన్ని తీసుకొచ్చి ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

చంద్రగిరి వైసీపీ అభ్యర్ధి  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్. ఆర్. కమ్మపల్లి పోలింగ్ బూత్‌ పరిధిలోని మాలపల్లి, మాదిగపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నించారు. 

తమ గ్రామంలో రీ పోలింగ్ నిర్వహించేందుకు కారణమైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకొన్నారు. రాత్రి 10 గంటల వరకు చెవిరెడ్డిని గ్రామస్తులు అడ్డుకొన్నారు. శుక్రవారం నాడు మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే గ్రామానికి చేరుకొన్నారు. గ్రామస్తులు ఆయనను అడ్డుకొన్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. 

 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి