Asianet News TeluguAsianet News Telugu

14వేల మందితో భారీఎత్తున... లాక్ డౌన్ సమయంలోనూ టిడిపి మహానాడు

తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూాడా మహానాడును భారీగా నిర్వహించాలని నిర్ణయించింది. 

TDP Leaders meeting over mahanadu Arrangements
Author
Guntur, First Published May 22, 2020, 8:12 PM IST

అమరావతి: ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మహానాడును భారీగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆ పార్టీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ప్రధానంగా మహానాడు నిర్వహణ, తీర్మానాలపై వీరు చర్చించారు. 

కరోనా వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూనే మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే ఈసారి మహానాడు నిర్వహించనున్నారు. ఈ నెల 27,28 తేదీల్లో కేవలం ఆరు గంటల్లోనే కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ మహానాడులో 14వేల మందికి  అవకాశం కల్పించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న యనమల, దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 27, 28 తేదీల్లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మహానాడు నిర్వహించాలని ఇటీవలే టిడిపి పొలిట్ బ్యూరో నిర్ణయించింది. కరోనా నిబంధనలను పాటిస్తూనే టిడిపి శ్రేణులందరికీ పండుగ పర్వదినమైన మహానాడును నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించిందని... అయితే అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు రావుల చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.  

read more  లీడ్ క్యాప్ భూముల కోసం... నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసిన టిడిపి

''పార్టీ ఆవిర్భావం నుంచి జరుపుకుంటున్న మహాద్భుత కార్యక్రమం మహానాడు. వార్షిక సమావేశంగా కాకుండా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు జన్మదినం మే28 కలిసి వచ్చేట్లుగా మహానాడును జరుపుకోవడం ఆనవాయితీ. తెదేపా శ్రేణులందరికీ పండుగ పర్వదినం మహానాడు. కానీ కరోనా సందర్భంగా ప్రత్యక్షంగా అందరం కలుసుకోలేని స్థితి. అయినప్పటికీ ఆ స్పూర్తిని కొనసాగించాలని నిర్ణయించాం'' అని అన్నారు. 

''మహానాడును వర్చువల్ గా జూం కాన్ఫరెన్స్ ద్వారా జరుపుకోవాలని నిర్ణయించాం. మహానాడుకు సంబంధించిన విధివిధానాలు సాంకేతిక  నిర్వహణపై దిశానిర్దేశం చేయమని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ను కోరాం'' అని అన్నారు.  

''మహానాడులో అనేక అంశాలపై చర్చలు జరపడం ఆనవాయితీ. ఈసారి కూడా మే 27, 28 రెండురోజుల్లో వర్చువల్ గా మహానాడు జరుపుకోడానికి అవసరమైన ఏర్పాట్లుకు సన్నద్ధమవుతున్నాం. విధివిధానాలను ఖరారు చేసుకోవడం, కమిటీలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా పాలిట్ బ్యూరో నిర్ణయించింది. కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని అధ్యక్షులు ఆదేశించారు'' అని తెలిపారు. 

read more  మూడు సార్లు భోజనం పెట్టినందుకే... కేసీఆర్ కు ఏపి ఆస్తులు: జగన్ పై దేవినేని ఉమ ఫైర్

''మహాపర్వదినమైన మహానాడులో తెదేపా నాయకులంతా కలుసుకోవడం, అభిప్రాయాలు ఒకరికొకరు చర్చించుకోవడం ఆనవాయితీ. అయితే ఈసారి జూం కాన్ఫరెన్స్ ద్వారా ఈ చర్యలకు అవకాశం కల్పించాలని అధ్యక్షులు చంద్రబాబు నిర్ణయించారు. ఉభయరాష్ట్రాల్లో తెదేపా ప్రజల పక్షాన ఉంటుంది, పోరాడుతుంది, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెదేపా పని చేసే క్రమంలో మరొక్కసారి తెదేపా విధానాలు సుస్పష్టం చేసే విధంగా మహానాడు నిర్వహించుకుంటాం'' అని రావుల తెలిపారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios