వైసిపిలో చేరిన టిడిపి నేతలు..కోడెలకు షాక్

First Published 28, Mar 2018, 1:49 PM IST
Tdp leaders jolts kodela by joining ysrcp in Guntur dt
Highlights
అసలే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది.

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా తయారైంది టిడిపి సీనియర్ నేత, స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిస్ధితి. అసలే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. దానికితోడు ప్రభుత్వ వ్యతరేకత తోడైంది. దానికిపై టిడిపిలో సీనియర్లుగా ఉన్న ఇద్దరు నేతలు వైసిపిలో చేరారు. దాంతో కోడెలకు షాక్ తగినట్లైంది.

విషయం ఏమిటంటే, కోడెల శివప్రసాద్ నియోజకవర్గం సత్తెనపల్లిలో టిడిపికి గట్టి దెబ్బ తగిలింది. ఎలాగంటే, కోడెల కుటుంబం అరాచకాలను భరించలేక సీనియర్ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావులు వైసిపిలో చేరారు. మంగళవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నియోజవర్గంలోకి అడుగు పెట్టిన సందర్భంగా వీరిద్దరూ జగన్ సమక్షంలో వైసిపి కండువాలు కప్పుకున్నారు.

నిమ్మకాలయ సత్తెనపల్లి నియోజవకవర్గ ఇన్చార్జి కూడా కావటం గమనార్హం. కోడెల కుటుంబం అరాచకాలను భరించలేకే తాము టిడిపిలో నుండి వైసిపిలోకి చేరినట్లు ఆరోపించారు. బిసి సామమాజికవర్గానికి చెందిన నిమ్మకాయలకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఎన్నికలు తరుముకొస్తున్న నేపధ్యంలో టిడిపిలోని ఇద్దరు కీలక నేతలు వైసిపిలో చేరటంతో కోడెలకు షాక్ తగిలినట్లైంది. మరి దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలాగుంటుందో చూడాలి.

loader