ప్రతి మూడు నెలలకోసారి ఏదో ఒక ప్రభుత్వ ఆస్తి తాకట్టు.. జగన్ పై టీడీపీ నేతలు ఫైర్... (వీడియో)
విశాఖ ఆస్తులు విజయవాడ రిజిస్టర్ కార్యాలయంలో తనఖాప్రక్రియ కొనసాగించారని.. ఈ అప్రజా స్వామిక చర్య పై ప్రజాపోరాటం , న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. దీని మీద ప్రజా ఉద్యమం చేస్తాం అన్నారు.
విశాఖపట్నం : దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖ లో 24 ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని వెలగపూడి రామకృష్ణ బాబు ఫైర్ అయ్యారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏదో ఒక ఆస్తి తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.
"
విశాఖ ఆస్తులు విజయవాడ రిజిస్టర్ కార్యాలయంలో తనఖాప్రక్రియ కొనసాగించారని.. ఈ అప్రజా స్వామిక చర్య పై ప్రజాపోరాటం , న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. దీని మీద ప్రజా ఉద్యమం చేస్తాం అన్నారు.
అప్పుల కోసం ‘‘ రుణ యజ్ఞం ’’, కొత్త కొత్త మార్గాల్లో యత్నాలు .. జగన్‌పై రఘురామ సెటైర్లు
ఇక పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ..మూడు వేల కోట్ల పైగా విలువ చేసే 24 ఆస్తులు తాకట్టు పెట్టారని విరుచుకుపడ్డారు. పరిపాలన చేతకాక ఇలాంటి చేష్టలకు దిగజారారన్నారు. అభివృద్ధి పేరిట ప్రజలు మోసం చేస్తున్నారు. దోపిడీ చేస్తున్నారన్నారు.
దీనిమీద ప్రజలే స్పందించాలని, టిడిపి చేస్తున్న ప్రజా పోరాటానికి మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ ఆస్తులు అమ్మకం మీద పోరాటం చేస్తాం అన్నారు.