అప్పుల కోసం ‘‘ రుణ యజ్ఞం ’’, కొత్త కొత్త మార్గాల్లో యత్నాలు .. జగన్‌పై రఘురామ సెటైర్లు

సీఎం వైఎస్ జగన్ (ys jagan), ఏపీ ప్రభుత్వంపై (ap govt) వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త కొత్త కోణాల్లో అప్పులు ఎలా తీసుకురావాలనే దానిపై తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన సెటైర్లు వేశారు

ysrcp mp raghu rama krishnam raju criticises ap govt on getting loans in different ways

సీఎం వైఎస్ జగన్ (ys jagan), ఏపీ ప్రభుత్వంపై (ap govt) వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త కొత్త కోణాల్లో అప్పులు ఎలా తీసుకురావాలనే దానిపై తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన సెటైర్లు వేశారు. రుణ యజ్ఞం పేరుతో అప్పులు తీసుకొస్తోందని రఘురామ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం (tdp) ఏపీ స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కింద రూ. 3 వేల కోట్ల రుణం తీసుకొచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా ఒక జీవో ఇచ్చి 574 ఎకరాలు, ఆర్ అండ్ బీ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావాలనుకుంటోందని రఘురామ ఆరోపించారు.

ప్రజల ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉండదని .. చెత్త నుంచి సంపదను తయారు చేసే సెంటర్లకు కూడా వైసీపీ పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు (high court) చివాట్లు పెట్టిందని ఆయన దుయ్యబట్టారు. మూడు రంగులు వేసే పనులకు ముఖ్యమంత్రి జగన్ ముగింపు పలకాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఏ అడుగుతున్నారని, వారి బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయని రఘురామ వెల్లడించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సరైన సమయానికి పెన్షన్ (pensions) రావడం లేదని ఆయన మండిపడ్డారు.

Also Read:రఘురామకు తెలంగాణ హైకోర్టు షాక్.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను వెనక్కిచ్చిన రిజిస్ట్రీ

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, సాంకేతిక కారణాలతో రఘురామ పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి ఇచ్చారు.  

కాగా, గత నెల మధ్యలో అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఊరట కలిగింది. రఘరామ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు (bail)  పిటిషన్లను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  తెలంగాణ హైకోర్టును కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios