Asianet News TeluguAsianet News Telugu

ఆస్తి పన్ను ఎగ్గొట్టిన టిడిపి ప్రముఖలు వీరే

విజయవాడ ఎంపి కేశినేని నాని, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విఎంసి కి పన్ను ఎగ్గొట్టారు

TDP leaders figure among  defaulters of Vijayawada municipal Corporation

విజయవాడ నగర పాలక సంస్థ (విఎంసి)కు  లక్షలాది రుపాయల బన్ను బకాయి పడిన వారిలో  రాజకీయ ప్రముఖులున్నారు.  ఈ విషయం విఎసిం తన వెబ్ సైట్ ల కూడాపెట్టేసింది. అయితే, ఈ పేర్లు బయటకు రావడంతో నిన్నంతా సంచలనం రేపింది. దానితో అదివారం మధ్యాహ్నం నుంచి బకాయి పడిన వారి పేర్లు జాబితానుంచి మాయమయ్యాయి.

 

విఎంసి కి పన్ను బకాయి పడిన వారిలో విజయవాడ ఎంపి కేశినేని నాని, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తో పాటు సహా పలు విద్యా, వ్యాపార సంస్థలవారి పేర్లున్నాయి.

 

సాధారణ పౌరులు ఆస్తిపన్ను చెల్లించడంలో  జాప్యం చేస్తే  అధికారులు నానా హంగామా చేస్తారు.  ఏళ్ల తరబడి రాజకీయ ప్రముఖులు  బకాయి ఉన్నా వారి జోలికి వెళ్ల లేకపోతున్నారు.

 

సర్కిల్‌-1లో పశ్చిమ శాసనసభ్యుడు జలీల్‌ఖాన్‌ అండ్‌ అదర్స్‌ పేరుతో 8 ఆస్తులకు సంబంధించి రూ.14,86,356 బకాయి ఉంది. ఇక  ఎంపి కేశినేని శ్రీనివాస్‌ (నాని) 2015 రూ.9,44,505 బకాయిల పడ్డారు. సెంట్రల్‌ ఎమ్మెల్యే, టిడిపి జాతీయ అధికారప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు బందరురోడ్డులోని ఆస్తులకు సంబంధించి రూ.28,02,606 బకాయి చెల్లించాల్సి ఉంది.

 

విఎంసికి రావాల్సిన బకాయిలు రూ.164.81కోట్లు కాగా, ఇందులో ఇప్పటివరకు వసూలైన మొత్తం రూ.71.01 కోట్లు, పర్సెంటేజీ 43.09శాతంగా ఉంది. అత్యధిక బకాయిలున్న వారిలో 100 మంది చొప్పున ఒక్కో సర్కిల్‌లో ఎంపికచేసి జాబితాను రూపొందించారు. 

 

ఇక ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలలో  ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ రూ.13,00,809, ప్రభుత్వ డెంటల్‌ కళాశాల రూ.18,39,392 , పున్నమి ఏపి టూరిజం హోటల్‌ రూ.3,39,608 బకాయి పడ్డాయి.  ప్రయివేటు రంగం నుంచి కెబిఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ రూ.53,25,674,  ఆస్‌బెస్టాస్‌ సిమెంట్‌ ప్రొడెక్ట్స్‌, భవానీపురం రూ.2,26,811,  కెబిఎన్‌ కళాశాల రూ.7,46,384, సెంట్‌ ఆన్స్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ రూ.13,46,629,ఎపి టీచర్స్‌ ఫెడరేషన్‌ రూ.3,92,669, పోలీస్‌ కమిషనరు అతిధి గృహం రూ 97,782 బకాయి పడ్డారు.

 

ఆసుపత్రుల బకాయిలు 

 

1. హెల్ఫ్‌ హాస్పిటల్‌ : రూ. 1,98,436

2. క్షీరసాగర్‌ హాస్పిటల్‌: రూ.1,98,436

3.ఎఎంఆర్‌ హాస్పిటాలిటీ సర్వీస్‌ : రూ.5,01,772

4. పిన్నమనేని పాలీక్లినిక్‌ : 2,66,123

5.ఎన్‌హెచ్‌5 వెటర్నరీ : 2,99,687

కళాశాలల బకాయిలు 

6. కెబిఎన్‌ కళాశాల : రూ.7,46,384

7.ఎస్‌కెపివి హిందు హైస్కూల్‌: రూ.8,51,034

8 జైకిసాన్‌ తెలుగు మీడియం స్కూల్‌ : రూ.7,51,874

9 దుర్గా మల్లేశ్వర సిద్ధార్ధ మహిళా కళాశాల: రూ.4,99,403

10.మేరీ స్టెల్లా కళాశాల : రూ.4,90,383

11.శారద ఎడ్యుకేషనల్‌ సొసైటీ : రూ.1,82,926

12.సెంట్‌ ఆన్స్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ : రూ.13,46,629

హోటల్స్‌ బకాయిలు 

13.హోటల్‌ తాన్య ఇంటర్నేషనల్‌ : 1,06,053 

14. హోటల్‌ తిలోత్తమ : 1,10,435

 

Follow Us:
Download App:
  • android
  • ios