బ్రేకింగ్ న్యూస్: వైసిపి నేతపై జెసి వర్గీయుల దాడి

బ్రేకింగ్ న్యూస్: వైసిపి నేతపై జెసి వర్గీయుల దాడి

ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ జెసి అనుచరుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో తమకు ఎదురు తిరిగుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటం జిల్లాలో సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి వారిలో పెరిగిపోతున్న అసహనానికి ఈ దాడులు అద్దం పడుతున్నాయి..

తెలుగు దేశం పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. తాడిపత్రిలో జేసీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు గయాజ్‌ బాషా ఆలియాస్‌ మున్నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మున్నా తృటిలో తప్పించుకున్నారు. 

తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తిని పరామర్శించి వస్తున్న సమయంలో జేసీ వర్గీయులు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వారి నుంచి మున్నా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అతనికి సంబంధించిన రెండు వాహానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

వైఎస్‌ఆర్‌సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మున్నాను హతమార్చేందుకు జేసీ వర్గీయులు కుట్రపన్నారని తెలుస్తోంది. అంతేకాక వక్ఫ్‌ ఆస్తుల అన్యాక్రాంతం, నిధుల గోల్‌మాల్‌ వెనుక టీడీపీ నేతల పాత్రపై మున్నా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడికి ప్లాన్‌ చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరాచకాలపై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page