TDP leaders: వైసిపి కి చరమ గీతం పాడాలని టీడీపీ నేత‌ బుద్ధ వెంకన్న అన్నారు. ఐదు జిల్లాలు ఏర్పడిన తరువాత 35 నియోజక వర్గాల ఇంచార్జిలతో  సమావేశంలో మాజీ మంత్రులు చిన్న రాజప్ప కళా వెంకటరావు, అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, బుద్ధ వెంకన్నలు పాల్గొన్నారు. 

TDP leaders: అధికార వైసిపికి చరమ గీతం పాడాలని టిడిపి నేత బుద్ధ వెంకన్న టిడిపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలు, తప్పుడు కేసులు పెడితే 35 నియోజక వర్గ ఇంచార్జీలు కలిసి పోరాడతామ‌ని అన్నారు. ఐదు జిల్లాలు ఏర్పడిన తరువాత 35 నియోజక వర్గాల ఇంచార్జిలతో సమావేశంలో మాజీ మంత్రులు చిన్న రాజప్ప కళా వెంకటరావు, అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, బుద్ధ వెంకన్న లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా టిడిపి నేత బుద్ధ వెంకన్న మీడియాతో మ‌ట్లాడుతూ.. ప్ర‌స్తుతంలో ఏపీలో రెండు వేల నోటు దొరకడం లేదనీ, అన్ని నోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. అధికారంలో ఉన్నా? లేకపోయినా? ప్రజా సమస్యలపై దృష్టి పెట్టే పార్టీ టీడీపీ ఒక్కటేన‌ని అన్నారు. ఇప్పటి వరకు ఏ నియోజక వర్గానికి ఆ నియోజక వర్గం పోరాటం చేసాయి, కానీ ఇప్పుడు ఏ సమస్య వచ్చినా అందరం కలిసి పోరాటం చేస్తామ‌ని బుద్ద‌వెంక‌న్న అన్నారు. జగన్ పీకే సర్వ్ లో కూడా ఈ 35 స్థానాల్లో 28 సీట్లు టిడిపి వస్తున్నట్టు ఫలితాలు వచ్చాయని అన్నారు. 

అంతా కలసి కట్టుగా పోరాడతాం: డిప్యూటీ సీఎం చినరాజప్ప

వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలు పై అంతా కలసి కట్టుగా పోరాడతామ‌ని మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే.. స్పందించి వ్యక్తి చంద్రబాబు అనీ, సీఎం జగన్ కనీసం ముందస్తు ఏర్పాట్లు చెయ్యలేదని అన్నారు. ఏటి గట్లు పటిష్ట పరిచే పరిస్థితి లేదని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వస్తున్నాడు అంటే జనాలు ఎలా మాట్లాడాలో శిక్షణ ఇస్తున్నారు అంటే అర్థం చేసుకొచ్చని అన్నారు. లేదంటే ఎమ్మెల్యే మనుషులను తీసుకెళ్లి సీఎం ముందు నిలబెట్టు కుంటున్నారని విమ‌ర్శించారు. వరదల్లో మృతి చెందిన వారికి 10 లక్షలు నష్ట పరిహారం, వ‌ర‌ద బాధితుల‌కు 25 కేజీలు బియ్యం, నిత్యవసర సరకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధమే: టీడీపీ మాజీమంత్రి కళావెంకటరావు

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామ‌ని టీడీపీ మాజీ మంత్రి కళా వెంకట రావు అన్నారు. రాష్ట్రంలో రోడ్డులు అన్ని జూన్ కి పూర్తి చేస్తానని సీఎం అన్నారు. జులై వచ్చింది రోడ్ల మీద నాట్లు వేసేలా ఉన్నాయని ఏద్దేవా చేశారు. ఏ గ్రామానికి వెళ్లిన రోడ్లు ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉంద‌నీ, ఎక్క‌డ‌ రోడ్డు చూసిన‌ గుంతలే క‌నిపిస్తున్నాయ‌ని అన్నారు. రైతు సమస్యలు పై పోరాటం చేయాలని, రాష్ట్రంలో రైతుల‌కు ఎరువులు దొర‌కడం లేద‌ని, ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఉన్న ఈ సీఎం నిరో చక్రవర్తి లా ఫిడేలు వాయించుకుంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.