బుగ్గనకు ఏం తెలుసు..ఆర్ధిక శాఖపై పెత్తనమంతా జగన్‌దే : వైసీపీ ప్రభుత్వంపై యనమల ఆగ్రహం
ఆర్ధిక శాఖలో ఏం జరుగుతోందో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్, పీఆర్సీ ఎందుకివ్వడం లేదని యనమల ప్రశ్నించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు. రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి వుందా అని యనమల సవాల్ విసిరారు. ఆర్ధిక శాఖలో ఏం జరుగుతుందో ఆ శాఖ మంత్రికి తెలుసా.. అసలు ఆర్ధిక శాఖపై పెత్తనమంతా జగన్‌దేనని యనమల ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్ని కోట్ల నిధులు ఇచ్చింది.. ఎన్ని కోట్లు దారిమళ్లాయి ?, ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్, పీఆర్సీ ఎందుకివ్వడం లేదని యనమల ప్రశ్నించారు.
ఇదిలావుండగా.. గత నెలలో రాష్ట్రంలో రవాణా వాహనాల పన్నును ఏపీ ప్రభుత్వం పెంచడంపై యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనపై ప్రజలకు అసహ్యం కలుగుతోందని.. రవాణా వాహనాల పన్నును పెంచడం వల్ల ప్రజలకు ప్రతి ఏటా రూ.250 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. టీడీపీ హయాంలో ప్రతి 6 నెలలకు రవాణా శాఖకు రూ.1500 కోట్ల ఆదాయం వచ్చేదని.. ప్రస్తుత వైసీపీ పాలనలో అది రూ.2,131 కోట్లకు పెరిగిందని యనమల దుయ్యబట్టారు.
Also REad: బైక్ నుంచి లారీ వరకు, రవాణా వాహనాల పన్ను పెంపు.. జగన్ ది బాదుడే బాదుడు : యనమల చురకలు
బైకు నుంచి లారీల వరకు వాహనాల కొనుగోలుపై లైఫ్ టైమ్ ట్యాక్స్‌ను 6 శాతం పెంచారని రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రెండు సార్లు మద్యం ధరలు, మూడుసార్లు ఆర్టీసీ బస్ టికెట్ల ధరలు, ఏడు సార్లు విద్యుత్ ఛార్జ్‌లను పంచారని యనమల చురకలంటించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ఛార్జీలు ఎక్కువని.. అన్ని రకాల ఛార్జీలను పెంచుతూ జగన్ ప్రభుత్వంపై భారాన్ని మోపుతోందని రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.