Asianet News TeluguAsianet News Telugu

నూతన పారిశ్రామిక విధానంపై మండిపడ్డ యనమల

వైసీపీ నిర్వాకాల వల్లే పారిశ్రామికరంగంలో మైనస్ 2.2% వృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు. తయారీ రంగం, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయన్నారు.
 

TDP Leader Yanamala Rama krishna Fire on CM YS Jagan
Author
Hyderabad, First Published Aug 11, 2020, 11:17 AM IST

నూతన పారిశ్రామిక విధానంతో ఒరిగిందేమీ లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా.. కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తారు. ఉపాధి కల్పనకు, భవిష్యత్ తరాలకు ప్రయోజనం లేదన్నారు. 

ఈ పాలసీ కోసమా 14నెలల విలువైన కాలం వృధా చేసింది..? అని ప్రశ్నించారు. వైసీపీ నిర్వాకాల వల్లే పారిశ్రామికరంగంలో మైనస్ 2.2% వృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు. తయారీ రంగం, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయన్నారు.


ఈ 14నెలల్లో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని...చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సగం జీతాలే అని ఆయన మండిపడ్డారు. క్రెడిట్ రేటింగ్ పడిపోయిందని...పెట్టుబడులు వెనక్కి పోయాయని తెలిపారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ నాయకులు నాశనం చేశారని వ్యాఖ్యానించారు. 

టీడీపీ ఏడాదికి సగటున రూ.1066 కోట్లు కేటాయిస్తే, వైసీపీ పెట్టింది రూ.852 కోట్లే అని దుయ్యబట్టారు. బలహీన వర్గాల వారికి, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశం కాలరాశారని...దీనికి తగిన మూల్యం వైసీపీ చెల్లించక తప్పదని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios